నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే హీరోలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ సంపాదించుకున్న రష్మిక.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. కొత్త బ్యూటీలు ఎంత మంది వస్తున్నా వారికి ధీటుగా నిలబడి అవకాశాలు అందుకుంటోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ వరుస ప్రాజెక్ట్ లను టేకప్ చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఇకపోతే గతంలో రష్మిక తెలుగులో కొన్ని క్రేజీ మూవీస్‌ను రిజెక్ట్ చేసింది.
అయితే అందులో మాస్ మహరాజా రవితేజ యాక్ట్ చేసిన ఒక సూపర్ హిట్ మూవీ కూడా ఉందండోయ్. ఇంతకీ రవితేజ, రష్మిక కాంబినేషన్ లో మిస్ అయిన ఆ చిత్రం మరేదో కాదు ధమాకా. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు
రవితేజ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా చేసింది. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, రావు రమేశ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. 2022లో విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. క్రాక్ తర్వాత హిట్ ముఖం చూడలేకపోయిన రవితేజ.. ధమాకాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. మరోవైపు శ్రీలీల ఈ మూవీతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే ధమాకాలో మొదట హీరోయిన్ క్యారెక్టర్ కు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన రష్మికను అనుకున్నారు. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ ఆ టైమ్ లో బాలీవుడ్ లో కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం వల్ల రష్మిక రవితేజ సినిమాకు నో చెప్పింది. దాంతో శ్రీలీలను హీరోయిన్ గా దింపారు. ఇక రవితేజ, శ్రీలీల మధ్య భారీ ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ.. వీరి జోడి మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే రవితేజ, శ్రీలీల జంటగా ఇటీవల మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. భాను భోగవరపు అనే నూతన డైరెక్టర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.