సినిమా ఇండస్ట్రీలో పెళ్ళికి ముందు చాలా మంది హీరోలు హీరోయిన్లు వారికి నచ్చిన వారితో ప్రేమలో పడుతూ ఉంటారు.. డేటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్ళికి ముందు వారికి నచ్చిన సెలబ్రిటీలతో డేటింగ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ లు చెప్పుకొని వేరే వారిని పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది డేటింగ్ చేసిన సమయంలోనే అభిప్రాయాలు కలిస్తే పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సీనియర్ నటి స్నేహ అంటే అందరికీ మంచి అభిప్రాయం ఉంది.
స్నేహ ఎక్కువగా ట్రెడిషనల్ పాత్రలే చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్నేహ ఒక సినిమాలో హీరోయిన్గా చేస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందే అన్న అభిప్రాయం సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉంది. అయితే అలాంటి స్నేహ కూడా పెళ్లికి ముందు కొందరితో ప్రేమలో పడి డేటింగ్ లు చేసిందట. అప్పట్లో డైరెక్టర్ సుశీ గణేషన్ కి స్నేహ అంటే ఇష్టం. ఆ కారణంతోనే స్నేహ ఎవరితో ఉన్నా కూడా అతడు ఎంత మాత్రం ఇష్టపడేవారు కాదట. ఒకరోజు స్నేహ వేరే హీరోతో సన్నిహితంగా ఉండటం చూసి వార్నింగ్ కూడా ఇచ్చారట.
అయినా కూడా స్నేహ తన పద్ధతి మార్చుకోకపోవడంతో డైరెక్టర్ సుశీ ఆమెపై దాడి చేయడం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది. ఆ తర్వాత స్నేహ ఓ నిర్మాతను ప్రేమించింది.. ఆ నిర్మాతతో పెళ్లి వరకు కూడా వెళ్ళింది.. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లి కొద్ది రోజులు ఉందనగా ఆ నిర్మాత మరో అమ్మాయితో కూడా ప్రేమలో ఉన్నాడన్న నిజం స్నేహకు తెలిసింది. వెంటనే ఆ నిర్మాతతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అయితే స్నేహ ఆ తర్వాత తన తోటి నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. 2012లో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా ? పెళ్లి తర్వాత స్నేహ తన జీవితాన్ని చాలా అందంగా ముస్తాబు చేసుకుని లీడ్ చేస్తుందని చెప్పాలి.