ఎన్టీఆర్ అంటే ఎలాంటి మచ్చలేని హీరో.. తాతకి తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ కొడుకుగా తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీతో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే అలాంటి ఈ హీరో మీద ఒక బాలీవుడ్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు చేశారు.ఎన్టీఆర్ నిన్ను వాడుకున్నాడు అంటూ మరో హీరోయిన్ ని వేధించాడట. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఏ హీరోయిన్ ని ఎన్టీఆర్ వాడుకున్నాడని వివాదాస్పద కామెంట్లు చేశారో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ నటి పాయల్ గోష్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఊసరవెల్లి మూవీలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన క్యారెక్టర్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి పాయల్ గోష్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. అంతేకాదు పాయల్ గోష్ ఎన్నో ఇంటర్వ్యూలలో బాలీవుడ్ నటీనటుల కంటే సౌత్ ఆర్టిస్టులే చాలా గొప్పవారు. వాళ్ళు లేడీ ఆర్టిస్టులను చాలా గౌరవిస్తారు అంటూ ఆసక్తికర కామెంట్లు చేసింది.అయితే గతంలో బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అయినటువంటి అనురాగ్ కశ్యప్ పై పాయల్ గోష్ సంచలన కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే.
అవకాశం ఇస్తానని చెప్పి ఇంటికి పిలిపించుకొని నాపై లైంగిక దాడి చేశాడు అంటూ కశ్యప్ మీద షాకింగ్ కామెంట్లు చేసింది. అంతేకాదు ఈ విషయం ప్రధాన మంత్రి వరకు చేరేలా నేను చేస్తానని గట్టిగా చెప్పింది. అయితే గతంలో ఇదే విషయం గురించి అనురాగ్ మాట్లాడుతూ.. ఆయన నన్ను మాత్రమే హీనంగా కాదు తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ పై కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. నువ్వేమైనా సతీ సావిత్రివా.. ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు..పెద్ద పతితలాగా మాట్లాడుతున్నావ్ అంటూ నా ఆత్మాభిమానం పై వల్గర్ కామెంట్స్ చేశాడు.
అయితే ఎన్టీఆర్ ప్రస్తావన ఇందులో ఎలా వచ్చిందంటే..ఓ సినిమాకి సంబంధించి పాయల్ గోష్ మేనేజర్ అనురాగ్ తో చర్చిస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఊసరవెల్లి మూవీ టీవీలో వచ్చిందట. ఆ టైంలో రిఫరెన్స్ కోసం ఊసరవెల్లి మూవీని అనురాగ్ కి చూపించగా ఆయన ఎన్టీఆర్ పై నీచమైన కామెంట్లు చేశారట. దాంతో ఆయన మాట్లాడిన మాటలను పాయల్ ఖండించింది.
అంతేకాదు దక్షిణాది స్టార్స్ దగ్గరే మంచి వాతావరణం ఉంటుంది అని ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. అలాగే ఎన్టీఆర్ తో సినిమా చేసే సమయంలో ఆయన చాలా బాగా మాట్లాడారని, బాగా చూసుకున్నారని ఏ ఒక్క సమయంలో కూడా ఆయన నాతో తప్పుగా ప్రవర్తించలేదు అంటూ పాయల్ గోష్ ఈ విషయాన్ని ఆన్లైన్ వేదికగా బయటపెట్టింది.