అక్కినేని ఫ్యామిలీ తాజాగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ రోజు అక్కినేని వారసుడు నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఇక గతంలో టాలీవుడ్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకొని నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి విడాకుల తర్వాత కొంతకాలానికే శోభిత దూళిపాళ్ల, నాగచైతన్య ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. వీరిద్దరూ కలిసి విదేశాలో ట్రిప్స్ కు వెళ్లి కెమెరా కళ్ళకు చిక్కడం.. చాలాసార్లు ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో ఆ వార్తలను నిజం చేస్తూ చైతన్య – శోభిత ధూళిపాళ్లతో ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అలాంటి ఈ జంట మధ్యలో ఎక్కడ ప్రేమ పుట్టింది..? వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమేంటి..? అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం.. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమకు కారణం నాగార్జున మేనకోడలు సుప్రియ అని తెలుస్తోంది. అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాలో శోభిత దూళిపాళ్ల హీరోయిన్. ఈ సినిమాలో సుప్రియ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా టైంలో వీరిద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడం.. ఈ క్రమంలో శోభిత ధూళిపాళ్ల కూడా అక్కినేని ఇంటికి గెస్ట్ గా ఎన్నోసార్లు వచ్చిందట.
అలా మొదట నాగచైతన్య – శోభిత.. సుప్రియ ద్వారానే కలుసుకున్నారని.. వీరిద్దరి మధ్య మెల్లమెల్లగా ఫ్రెండ్‌షిప్ కుదరడం.. అది కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే వీరి మధ్య ప్రేమ చిగురించే టైంకు సమంతకు.. నాగచైతన్యకు విడాకులు కూడా కాలేదట. కాగా సమంత, నాగచైతన్య విడాకులకు శోభిత కూడా ఒక కారణం అని టాక్. ఏది ఏమైనా చివరకు ఇరుకుటుంబ సబ్యులను ఒప్పించుకుని ఈ జంట ఒకటయ్యారు. ఒకరకంగా నాగచైతన్య , శోభిత ధూళిపాళ్లను కలవడానికి సుప్రియనే ప్రధాన కారణం. మొదటి నుంచి నాగచైతన్య, సమంత జంటకు సెపరేట్ ఫ్యాస్ బేస్ ఉంది. ఈ క్రమంలో నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ ఫిక్స్ వైరల్ అవ్వడంతో శ్యామ్ – చెయ్ అభిమానులు ఈ వార్తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.