Moviesత్రివిక్రమ్‌ మీద ఆ కోపాన్ని హరీష్ శంకర్ ఇలా తీర్చుకున్నాడా..?

త్రివిక్రమ్‌ మీద ఆ కోపాన్ని హరీష్ శంకర్ ఇలా తీర్చుకున్నాడా..?

భారీ అంచనాల మధ్య రవితేజ, హరిష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా తాజాగా రిలీజ్ అయింది. కొత్త అమ్మాయి భాగ్యశ్రీ అందాల ఆరబోత గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు బాగా చర్చించుకుంటున్నారు. అయితే అంతకంటే కూడా సినిమా జనాలు ఒక విషయం గురించి ఇప్పుడు బాగా చర్చించుకుంటున్నారు. సినిమాలో హీరో కావాలనుకునే కమెడియన్ చమ్మక్ చంద్ర.. అతడిని మంచి హీరోని చేస్తా అంటూ పక్కనే కూడా ఉండే గురూజీ అని పిలిపించుకునే మరో కమెడియన్ ప్రభాస్ శ్రీను.. పాత్రలు ఉంటాయి.

ఈ గురూజీ.. గురూజీ.. అనే పిలుపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసి కావాలని పెట్టారా ? అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నాయి. మీడియా సర్కిల్స్‌లోను ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్ అయింది. దర్శకుడు హరీష్ శంకర్ ఇలా ఎందుకు చేసి ఉంటారు అనే డిస్కషన్ కూడా టాలీవుడ్ లో వినిపించడం మొదలైంది. అసలు నిజాలు ఏమిటో.. దేవుడికే తెలియాలి. అయితే ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాకు పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా డేట్లు ఇవ్వలేదు. దీని వెనక త్రివిక్రమ్ హస్తం ఉందని.. హరీష్ శంకర్ భావించారని.. అప్పటినుంచి హరీశంకర్ – త్రివిక్రమ్ మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉందని ప్రచారం నడిచింది.

ఎందుకంటే భగత్ సింగ్ సినిమా కంటే తర్వాత ప్రారంభమైన సినిమాలు కూడా షూటింగ్ పూర్తయి రిలీజ్ అయిపోయాయి. ఆ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్లకు త్రివిక్రమ్ అండదండలు ఉన్నాయి. అయితే హరీష్ శంకర్‌తో పాటు.. మరో దర్శకుడు క్రిష్‌ లాంటి వాళ్లకు త్రివిక్రమ్ అండదండలు లేకపోవడంతో.. భగత్ సింగ్, వీరమల్లు లాంటి ప్రాజెక్టులు ముంద‌లకు కదలటం లేదని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అసలు హరీష్ శంకర్ అయితే భగత్ సింగ్ సినిమా కోసం మూడేళ్లు ఏ ప్రాజెక్టు కూడా ఎంచుకోలేదు.

చివరికు ఆ సినిమా ఎలాగో లేట్ అయ్యేలా ఉందని.. అప్పుడు రవితేజతో మిస్టర్ బచ్చన్ తెర‌కెక్కించాడు. భగత్ సింగ్ సినిమా విషయంలో చాలా సహనంతో ఎదురుచూసిన హరీష్ శంకర్.. త్రివిక్రమ్ మీద కోపాన్ని ఇలా తీర్చుకున్నాడా అన్న సందేహాలు అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే ఇందులో నిజం ఎంతో..? అబద్ధం ఎంతో..? వారికి తెలియాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news