Moviesద‌డ పుట్టిస్తోన్న ' దేవ‌ర ' విల‌న్ బైరా గ్లింప్స్‌… ట్విస్ట్...

ద‌డ పుట్టిస్తోన్న ‘ దేవ‌ర ‘ విల‌న్ బైరా గ్లింప్స్‌… ట్విస్ట్ కూడా ఇచ్చారుగా… ( వీడియో )

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న దేవ‌ర సినిమా రెండు పార్టులుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. తొలి పార్ట్ సెప్టెంబ‌ర్ 27న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కేవ‌లం తెలుగుతో పాటు అటు బాలీవుడ్ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. పైగా ఆచార్య త‌ర్వాత కొర‌టాల డైరెక్ట్ చేస్తోన్న సినిమా.. ఇటు త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

ఇక ఈ రోజు దేవ‌ర సినిమా నుంచి భైరా పాత్ర‌లో న‌టిస్తోన్న సైఫ్ ఆలీఖాన్ బ‌ర్త్ డే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో ముందు ఆయుధ పూజ చూపించారు. ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల క‌త్తులు క‌నిపించాయి. ప్ర‌జలంతా క‌లిసి దైవానికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ త‌ర్వాత భైరా క‌నిపిస్తాడు. ఓ ఆల‌యంలో భైరా భైరా అంటూ ప్ర‌జ‌లంద‌రూ జేజేలు కొడుతూ ఉంటే వారి మ‌ధ్య‌లో భైరా ఎంట్రీ ఉంటుంది.

భైరా వేటాడితే తరతరాలు చెప్పుకొనేలా ఉంటుందనే విధంగా ఓ కొటేషన్ ఇచ్చారు. దేవ‌ర‌లో హీరో ఎన్టీఆర్ గ్లింప్స్‌లో ఈ స‌ముద్రం చెప‌ల్ని కంటే క‌త్తుల్ని.. నెత్తురుని ఎక్కువ చూస్తుండాది.. అందుకేనేమో దీనిని ఎర్ర స‌ముద్రం అంటారు అని ఎన్టీఆర్ చాలా ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ చెపుతాడు. ఇక తాజా గ్లింప్స్‌లో
భైరా ధాటికి మట్టి కుస్తీలో ప్రత్యర్థుల రక్తం నేల మీద చిందినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో జాన్వీక‌పూర్ హీరోయిన్ అయితే… సైఫ్ ఆలీఖాన్‌తో పాటు మ‌రో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాబీడియోల్ కూడా మ‌రో విల‌న్గా క‌నిపిస్తారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 27న సినిమా విడుదల అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news