Moviesభార్య‌కు క‌మెడియ‌న్ హ‌ర్ష విడాకులు.. అస‌లేం జ‌రిగింది..?

భార్య‌కు క‌మెడియ‌న్ హ‌ర్ష విడాకులు.. అస‌లేం జ‌రిగింది..?

ఇటీవ‌ల కాలంలో విడాకుల బాట ప‌డుతున్న సినీ తారల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌మ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. అయితే టాలీవుడ్ లో స్టార్ క‌మెడియ‌న్ గా గుర్తింపు తెచ్చుకున్న వైవా హ‌ర్ష కూడా భార్య అక్ష‌ర‌కు విడాకులు ఇవ్వ‌బోతున్నాడంటూ రెండు రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విధంగా ప్ర‌చారం జ‌ర‌గ‌డానికి హ‌ర్ష పెట్టిన ఒక పోస్టే కార‌ణం.

విశాఖపట్నంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన హ‌ర్ష‌.. యూట్యూబ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి క‌మెడియ‌న్ గా త‌క్కువ స‌మ‌యంలో భారీ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవ‌ల సుందరం మాస్టార్ మూవీతో హీరోగా కూడా మారాడు. అయితే ఏద‌మైందో ఏమో గానీ స‌డెన్ గా సోష‌ల్ మీడియాలో.. లైఫ్ అనేది రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు, ఎగ్జైట్మెంట్, చికాకు, భయం, థ్రిల్‌.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి.

మనం బకెల్‌ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్‌ చేయడం తప్ప ఏం చేయాలేం. జీవితంలో దేనిని ఆశించకూడదు. తర్వాత నిరాశ చెందకూడదు. లైఫ్ ఎటు వెళ్తే అటు పోవడమే అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన చాలా మంది హ‌ర్ష ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేస్తున్నాడ‌ని.. భార్య ఆక్ష‌ర‌కు విడాకులు ఇవ్వ‌బోతున్నాడ‌ని క‌థ‌నాలు ఆల్లేసి జోరుగా ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు.

అయితే ఈ ప్ర‌చారంపై హ‌ర్ష రియాక్ట్ అవుతూ తాజాగా మ‌రో పోస్ట్ పెట్టాడు. విడాకుల వార్త‌ల్లో కొంచెం కూడా నిజం లేద‌ని అంద‌రికీ క్లారిటీ ఇచ్చాడు. త‌న‌ గత పోస్టు గురించి ఆరా తీస్తున్న అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. చాలా మంది అందమైన వ్యక్తులను కలిగి ఉన్నందుకు పర్సనల్ లైఫ్ లో తాను ఎంతో హ్యాపీ ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. అయితే ఎటొచ్చి పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నాన‌ని.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాన‌ని హ‌ర్ష తెలిపాడు. జీవితమంటే ఇంతే.. దానికి వ్యతిరేకంగా ఎవరూ వెళ్ళలేరు అని హ‌ర్ష పేర్కొన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news