నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రియ తెరకెక్కింక్కించిన మోస్ట్ అవైటెడ్ సాలిడ్ మాస్ డ్రామా సరిపోదా శనివారం. టాలీవుడ్లో ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసి మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఎస్.జె సూర్య సరిపోదా శనివారం సినిమాలో నానిని బలంగా ఢీకొట్టే విధంగా కనిపిస్తుండడంతో సినిమాపై రిలీజ్ ముందే మంచి అంచనాలు ఉన్నాయి. ఆడియన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆశిస్తూ ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లోనూ భారీ బుకింగ్ నమోదు చేసింది.
ఇక ఈ సినిమా యుఎస్ మార్కెట్లో అదరగొడుతోంది. నాని యూఎస్ లో వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నడంతో అక్కడ సరిపోదా శనివారం సినిమాకు సాలిడ్ ఫ్రీ సేల్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. కేవలం ఫ్రీ సేల్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు అక్కడ ఐదు లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది చాలా ఎక్కువ మొత్తం అని చెప్పాలి… ఫస్ట్ డే ముగిసే టైంకు ఈ వసూళ్లు మరింతగా పెరుగుతాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. డివిడి ఎంటర్టైన్మెంట్ పై త్రిపుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎక్కించిన డివీవీ దానయ్య సరిపోదా శనివారం సినిమాను నిర్మించారు.