షాక్, మిరపకాయ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న మిస్టర్ బచ్చన్.. భారీ అంచనాల నడుమ డబుల్ ఇస్మార్ట్, ఆయ్, తంగలాన్ వంటి సినిమాలతో పోటీ పడుతూ ఆగస్టు 15న విడుదలైంది.
అయితే ప్రేక్షకుల మెప్పు పొందడంలో విఫలం అయింది. రవితేజ అభిమానుల నుంచి సైతం మిస్టర్ బచ్చర్ కు చాలా మిశ్రమ స్పందన లభించింది. ఇది తొలి రోజు కలెక్షన్స్ ను గట్టిగా ప్రభావితం చేసింది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ప్రీమియర్ షోల కలెక్షన్స్‌తో సహా చిత్రం మొదటి రోజున చాలా యావరేజ్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.56 కోట్ల షేర్, రూ. 6.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసిన మిస్టర్ బచ్చన్.. వరల్డ్ వైడ్ గా రూ.5.26 కోట్ల షేర్, రూ. 7.80 గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.
ఏరియాల వారీగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే..
నైజాం- 2.10 కోట్లు
సీడెడ్- 73 లక్షలు
ఉత్తరాంధ్ర- 50 లక్షలు
తూర్పు- 26 లక్షలు
పశ్చిమ- 20 లక్షలు
గుంటూరు- 38 లక్షలు
కృష్ణ- 21 లక్షలు
నెల్లూరు- 18 లక్షలు
ఏపీ + తెలంగాణ = 4.56కోట్లు(6.40కోట్లు~ గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా- 32 లక్షలు
ఓవర్సీస్- 38 లక్షలు
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్= 5.26కోట్లు(7.80కోట్లు~ గ్రాస్)
కాగా, రిలీజ్ కు ముందు ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ చిత్రానికి రూ. 31 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా విడుదలైంది. ఇప్పుడు రవితేజకు హిట్ పడాలంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా మిస్టర్ బచ్చన్ ఇంకా రూ. 26.74 కోట్ల షేర్ కలెక్షన్స్ ను వసూల్ చేయాల్సి ఉంటుంది. మరి యావరేజ్ టాక్ తో ఈ టార్గెట్ ను రవితేజ ఏ మేరకు రీచ్ అవుతాడో చూడాలి.