ప్రతి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హీరోల సినిమాలు పోటీ పడటం ఆనవాయితీగా వస్తోంది. 2025 సీజన్ కూడా ఎప్పటిలాగా వాడేవిడిగా ఉండబోతుంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సంక్రాంతి రేసులో ముందు ఉంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా కూడా ఈ సీజన్లోనే రాబోతుంది. ఇప్పుడు బాలకృష్ణ కూడా సంక్రాంతి సంబరానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ – బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ దసరాకి గాని.. ఈ యేడాది చివర్లో గాని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్లానింగ్ మారింది.. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాలని బాలయ్య గట్టిగా ఫిక్స్ అయ్యాడు.
అలా ఈ సంక్రాంతి పోటీకి మూడు సినిమాలు రేసులో ఉన్నాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నా అందరి దృష్టి చిరంజీవి – బాలకృష్ణ సినిమాలపై పడటం సహజం. సమఉజ్జీలు ఇద్దరు బరిలోకి దిగితే ఆ మధ్య వేరుగా ఉంటుంది. గత నాలుగు దశాబ్దాలుగా సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ పడటం ఆనవాయితీగా వస్తోంది. 1985 సంక్రాంతికి చిరంజీవి చట్టంతో పోరాటం సినిమాతో వస్తే అదే సీజన్లో బాలయ్య ఆత్మబలం వదిలారు. 1987లో చిరు దొంగ మొగుడు అవుతారం ఎత్తితే.. బాలయ్య భార్గవ రాముడు గా వచ్చి ఢీకొట్టారు. రెండు సినిమాలు హిట్ అయ్యాయి.
దొంగ మొగుడు కమర్షియల్ గా ఇంకా బాగా ఆడింది. 1988లో చిరంజీవి మంచి దొంగ – బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ గా వచ్చారు. 1989లో చిరంజీవి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు … బాలయ్య భలేదొంగ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సార్లు బాలయ్య పై చిరంజీవిపై చేయి సాధించారు. 1997లో చిరంజీవి హిట్లర్‌గా… బాలయ్య పెద్దన్నయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు అన్నయ్య కథలే.. రెండు హిట్ సినిమాలు.. 1999లో బాలయ్య సమరసింహారెడ్డిగా … చిరంజీవి స్నేహం కోసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాలయ్య పై చేయి సాధించారు. 2001లో బాలయ్య నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అయితే.. చిరంజీవి మృగరాజు డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత చాలా యేళ్లకు మళ్ళీ 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే బాలయ్య తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల చేశారు.. రెండు సూపర్ హిట్లు అయ్యాయి. ఇక 2023లో చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బాలయ్య వీర సింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి చిరంజీవి, బాలయ్య పోటీపడుతున్నారు మరి ఈసారి ఎవరిది పై చేయి అవుతుందో ? చూడాలి. మామూలుగా చూస్తే చిరంజీవి భారీ బడ్జెట్ సినిమా సోషియో ఫాంటసీ సినిమా కావడంతో కాస్త ప్లస్ గా కనిపిస్తోంది. బాలయ్య – బాబి కాంబినేషన్ అంటే రొటీన్ ఊరమా సినిమాయే.. మరి ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.