మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. గ్లామర్ ఫిల్మ్ లోకి రాకపోయినప్పటికీ.. పర్సనల్ లైఫ్ ద్వారా శ్రీజ ఎక్కువ పాపులర్ అయింది. 2007లో శిరీష్ భరద్వాజ్‌ను శ్రీజ పెళ్లి చేసుకుంది. అది కూడా అలా ఇలా కాదు ఇంట్లో నుంచి పారిపోయి మీడియా సపోర్ట్ తో శిరీష్ చేత మూడు ముళ్లు వేయించుకుంది. అప్పట్లో చిరంజీవికి ఉన్న పేరును, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను శ్రీజ గట్టిగానే డ్యామేజ్ చేసింది.
శిరీష్, శ్రీజ దంపతులకు ఓ పాప జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. శిరీష్ నుంచి విడిపోయిన శ్రీజ.. మళ్లీ తండ్రి చెంతకే చేరింది. 2016లో చిరంజీవి తన కూతురికి కల్యాణ్ దేవ్‌తో రెండో వివాహం జరిపించారు. కానీ శ్రీజ లైఫ్‌లో సేమ్ సీన్ రిపీట్ అయింది. కళ్యాణ్ దేవ్ తో ఒక పాపకు జన్మనిచ్చాక.. విభేదాలతో అతని నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లతో శ్రీజ సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది.
ఇకపోతే శ్రీజ అనాడు శిరీష్ కోసం ఇంట్లో నుంచి పారిపోకపోయుంటే.. నేడు ఓ స్టార్ హీరోకు వైఫ్ గా చలామణి అవుతుండేదట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్. మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య అనుబంధం విడతీయలేనిది. అయితే ఆ బంధాన్ని మరింత బలపరచడానికి చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజను అల్లు అర్జున్ కి ఇచ్చి వివాహం జరిపించాలని ఎంతగానో ఆశ పడ్డారట.
అల్లు అరవింద్ కూడా శ్రీజను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని భావించారట. కానీ శ్రీజ చేసిన ఒక్క తప్పుతో మొత్తం చెడింది. ఆమె జీవితం తారుమారు అయింది. శిరోష్ కోసం వెళ్లిపోయి స్టార్ హీరోకు భార్య అయ్యే గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఇక అల్లు అర్జున్ 2011లో ఓ ఇంటివాడు అయ్యాడు. వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.