పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నారు. గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ తల మునకలై ఉన్నారు. ఇప్పుడు పవన్ పిఠాపురం ఎమ్మెల్యే… ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రి పైగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాల బాట పట్టాలని డిసైడ్ అయ్యారు. పవన్ తన చేతిలో ఉన్న అన్ని సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే నిర్మాతల వైపు నుంచి ఒత్తిళ్లు.. విన్నపాలు కూడా ఉన్నాయి. హరిహర వీరమల్లు – ఓజి – ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
హరిహర వీరమల్లు – ఓజి సినిమాలు ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయి. దీంతో ఈ రెండు సినిమాలు త్వరగా పూర్తి చేస్తారని… ఉస్తాద్ భగత్ సింగ్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తారంటూ గుసగుసలు వినిపించాయి. దానికి కారణాలు లేకపోలేదు… ఉస్తాద్ షూటింగ్ 20 శాతం మించి జరగలేదు.. మిగిలినవి అలా కాదు పవన్ గట్టిగా రెండు సినిమాలకు.. చెరో నెల రోజులు సమయం కేటాయిస్తే షూటింగ్ పూర్తి అయిపోతుంది. మరోవైపు మిస్టర్ బచ్చన్‌తో హరీష్ శంకర్‌కు గట్టి ప్లాప్ తగిలింది. అందుకే భగత్ సింగ్ సినిమాను పూర్తిగా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తారని ఇండస్ట్రీలో ఒకటే ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. డిసెంబర్, జనవరి నాటికి ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను తాము పూర్తి చేస్తామని.. పవన్ డేట్లు ఇచ్చారని.. కొద్ది వారాల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని.. తెలిపింది. అంతే కాదు.. సెప్టెంబరు 2 పవన్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ కూడా ఇవ్వడానికి మైత్రీ వాళ్లు రెడీగా ఉన్నారు. అంటే పవన్ మూడు సినిమాలు పూర్తి చేయాలని డిసైడ్ అయిపోయారన్నమాట. ఏదేమైనా ఇది హరీష్ శంకర్‌కు మంచి బూస్టప్ ఇచ్చే న్యూస్.. మిస్టర్ బచ్చన్‌తో పోయిన పరువును భగత్‌సింగ్‌తో తీసుకొచ్చుకుంటాడని ఆశిద్దాం.