Moviesబ‌న్నీ Vs మెగాక్యాంప్‌.. బాల‌య్య Vs ఎన్టీఆర్ …!

బ‌న్నీ Vs మెగాక్యాంప్‌.. బాల‌య్య Vs ఎన్టీఆర్ …!

రెండు రోజుగా రోజులుగా తెలుగు మీడియా… తెలుగు సోషల్ మీడియాలో ఒక్కటే అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్మగ్లర్లు హీరోలు ఏమిటి అని అన్నాడు కదా… బన్నీ మీద ఫుల్ నెగటివ్.. అప్పట్లో నాగబాబు కూడా పరాయోళ్ళు.. సొంతోళ్లు అని అన్నాడు. ఇక ఈ గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా బన్నీ నా ఫ్రెండ్స్ కోసం నేను ఏమైనా చేస్తా.. నా మనసుకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తా అంటూ నాగబాబు.. పవన్ కళ్యాణ్ కు ఒకటే ఇచ్చి పడేశాడు. ఇదే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సుకుమార్‌ను హత్తుకున్నాడు అంటే విభేదాలు లేవు అని ఒకడు అంటాడు.. ఏది ఏమైనా బన్నీ గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి.. మెగా అభిమానులకు దూరంగా తనకంటూ ఒక ఆర్మీ ఏర్పరచుకుంటూ వస్తున్నాడు ఇది నిజం.

ఏది ఏమైనా చిరంజీవి – అల్లు అరవింద్ కుటుంబాల మధ్య గతంలో ఉన్నంత బలమైన బంధం లేదని అంటున్నారు. బన్నీ మాత్రమే కాదు అల్లు అరవింద్ కూడా చిరంజీవి … మెగా కాంపౌండ్ కు దూరంగా వెళుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు నాగబాబు – పవన్ కళ్యాణ్ – చిరంజీవి మెగా ఫ్యామిలీ అంతా ఒకటవుతున్నారు. ఇక మెగా – అల్లు కుటుంబాల మధ్య ఇప్పటికే ఉన్న గ్యాప్‌ను బన్నీ మరింతగా పెంచుతున్నారా ? అన్న సందేహాలు చర్చ‌లు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో కుటుంబంలోనూ ఇలాంటి కథే కనిపిస్తుంది. బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది.

ఈ సందర్భంగా పెద్ద ఈవెంట్ టాలీవుడ్ చేస్తుంది.. సెప్టెంబర్ ఒకటో తేదీన దానికి జూనియర్ ఎన్టీఆర్‌ను పిలుస్తారా పిలవరా ? అన్న చర్చలు.. ఇక మొదటి నుంచి జూనియర్ నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడా ? లేదా నందమూరి కుటుంబమే జూనియర్‌ను దూరంగా పెడుతుందా అన్నది తేలటం లేదు.. కానీ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు క్యాంప్ కి 10 అడుగుల దూరంలోనే మెలుగుతున్నాడు. చివరికి తన సోదరికి కూకట్‌ప‌ల్లి ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ ప్రచారానికి వెళ్లలేదు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అవుతోంది. దీని ప్రి రిలీజ్ ఈవెంట్ కర్నూల్లో భారీగా ప్లాన్ చేస్తున్నారు.. అప్పుడు బాలయ్యను పిలుస్తాడా ? ఎన్టీఆర్ అంటే కచ్చితంగా పిలవడమే చెప్పాలి. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ ఎలా నడుస్తుందో.. జూనియర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ వార్‌ కూడా అలాగే నడుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news