Moviesబ‌న్నీ ఫ్యాన్స్ బాధ ప‌గోడికి కూడా వ‌ద్దు.. న‌ర‌కం చూస్తున్నారుగా…!

బ‌న్నీ ఫ్యాన్స్ బాధ ప‌గోడికి కూడా వ‌ద్దు.. న‌ర‌కం చూస్తున్నారుగా…!

తెలుగులో మళ్లీ సినిమాల హడావుడి కనిపిస్తోంది. ప్ర‌భాస్‌ కల్కి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆగస్టు 15 కానుకగా రామ్ డబుల్ ఇస్మార్ట్.. రవితేజ మిస్టర్ బ‌చ్చ‌న్ – నార్నే నితిన్ ఆయ్ – విక్రమ్ తంగలాన్‌ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. థియేటర్లు అన్ని కళ‌కళ‌లాడుతున్నాయి. ఇక‌ హిందీలో కూడా మూడు సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లు ఇలా కళకళలాడుతుంటే బన్నీ అభిమానుల బాధ అయితే వర్ణనాతీతం. అసలు తమ బాధ పగోడికి కూడా రాకూడదు అని వాళ్ళు దండాలు పెట్టుకుంటున్నారు. అదేంటి భారీ సినిమాలు రిలీజ్ అయ్యి థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతుంటే బన్నీ అభిమానులు బాధపడటం ఏంటని ? అనుకుంటున్నారా అక్కడే ఉంది కథ.

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ రోజు పుష్ప 2 సినిమా థియేటర్లోకి వచ్చి ఉండేది అల్లు అర్జున్ ఆర్మీ థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటూ ఉండేది. కానీ బన్నీ సినిమాను వాయిదా వేశారు. అయితే బన్నీ అభిమానులు బాధపడటానికి మరో కారణం కూడా ఉంది. సినిమా ఎలాగూ రిలీజ్ కాలేదు.. కనీసం పుష్ప 2 నుంచి ఏదైనా ఒక చిన్న వీడియో లేదా కనీసం ఆగస్టు 15 సందర్భంగా ఒక పోస్టర్ అయిన రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని వారు బాధపడుతున్నారు. గతంలో ప్రభాస్ కూడా తన అభిమానుల విషయంలో ఇలాగే చేశాడు. సలార్ వాయిదా పడినప్పుడు అభిమానులలో జోష్ నింపేందుకు ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఉన్నంతలో ఆనందం పంచేవాడు.

ఈరోజు పుష్ప 2 నుంచి అలాంటి పోస్టర్ ఒక్కటి కూడా రాలేదు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీకి వచ్చేది కూడా అనుమానమే అని తెలుస్తోంది. సుకుమార్ సినిమాను ఒక పట్టాన చెక్కడు.. చెక్కి చెక్కి వదులుతూ ఉంటాడు. చాలా గ్యాప్ తర్వాత రీసెంట్గా సెట్స్‌ మీదకు వచ్చింది. పుష్ప 2 సినిమా ప్రస్తుతం బన్నీ ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా పూర్తి చేద్దామా అనే పనుల‌లో బిజీగా ఉన్నాడు. బన్నీ వరుసగా కాల్ షీట్లు కేటాయిస్తున్న సినిమా మాత్రం ఎప్పుడూ ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. సినిమా ఆలస్యం అవుతున్న కొద్ది మీద ఉన్న క్రేజ్ అయితే తగ్గుతూ వస్తున్న మాట వాస్తవం. ఇప్పటికే పుష్ప రిలీజ్ అయి దాదాపు మూడేళ్లు కావస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news