ఒకప్పుడు తన సినిమాలతో టాలీవుడ్ లో హవా కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి వరుస బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది.దీంతో భూమిక పేరు టాలీవుడ్ లో చాలా వైరల్ గా మారింది. అలా ముగ్గురు హీరోలకు హిట్స్ ఇచ్చిన భూమికకి ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ వచ్చాయి.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సెలబ్రిటీలకు యోగ నేర్పించే యోగ టీచర్ భరత్ ఠాకూర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.
అయితే అప్పట్లో భూమిక తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అనే న్యూస్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ విషయం మీడియాలో వైరల్ అయ్యేసరికి ఎన్నో పుకార్లు ఈ జంట మీద పుట్టుకుచ్చాయి. ఇక భరత్ ఠాకూర్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే భూమిక తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుందనే రూమర్స్ కూడా మీడియాలో వినిపించాయి.. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకొని కోర్టులో కేసు కూడా వేద్దామనుకున్నారనే టాక్ కూడా వినిపించింది.
కానీ సడన్గా ఓ హీరో ఎంట్రీ తో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇక ఆ హీరో ఎవరు కాదు నాగార్జున.. అక్కినేని నాగార్జునతో స్నేహమంటే ఇదేరా అనే మూవీలో భూమిక నటించింది. అయితే ఈ సినిమాలో నాగార్జునతో భూమికకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట. అలా భూమిక భరత్ ఠాకూర్ విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇంటికి వెళ్లి మరీ భూమిక,భరత్ ఠాగూర్ ని అడిగి తెలుసుకున్నారట నాగార్జున. కానీ భూమిక ఇచ్చిన ఆన్సర్ కి నాగ్ దిమ్మతిరిగింది.
ఎందుకంటే మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ మొత్తం పుకార్లే అని,మేమిద్దరం విడాకులు తీసుకోవడం లేదని, కానీ ఈ విడాకుల వార్తల మీద స్పందిస్తే ఆ వార్తలు మరింత ఎక్కువవుతాయనే ఉద్దేశంతో దీన్ని ఖండించడం లేదు సమర్దించడం లేదు అంటూ భూమిక చెప్పిందట. ఇక ఈ విషయం బయట పడడంతోనే భూమిక భరత్ ఠాగూర్ మధ్య విడాకుల వార్తలు కేవలం రూమర్సే అని అందరూ కొట్టిపారేశారు.