Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్ 4… అంత‌కు మించి..?

బాల‌య్య అన్‌స్టాప‌బుల్ 4… అంత‌కు మించి..?


నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి మూడు వరుస సూపర్ డూపర్ హిట్లతో పాటు ఇటు బుల్లితెరపై అనుస్టాప బుల్ షోతో బాలయ్య వెండితెర బుల్లితెరను షేక్ చేసి పడేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య కేఎస్ రవీంద్ర ( బాబి ) దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా షెడ్యూల్ కి మధ్యలో బాలయ్య మరోసారి తన అభిమానులను అనుస్టాప‌బుల్ టాక్ షో ద్వారా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు భారీ విజయాలు సొంతం చేసుకున్నా

ఇప్పుడు బుల్లితెర అభిమానులు .. ఓటిటి అభిమానులు అందరూ కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈసారి తొలి రెండు సీజన్లకు మించి అనేలా అనుస్టాప‌బుల్ షో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి కూడా స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇక బాలయ్యకు మరో సీనియర్ హీరో నాగార్జునకు కొంతకాలంగా అంత సఖ్యత లేదు. ఈ క్రమంలోనే నాగర్జున కూడా ఈ షోకు ముఖ్యఅతిథిగా వస్తారని తెలుస్తోంది. నెవర్ బిఫోర్ అనేలా ఈ సీజన్ షోలు ప్లాన్ చేస్తున్నారట.

తాజా సమాచారం ప్రకారం మూడో సీజన్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ మధ్యలో షూటింగ్ ప్రారంభమవుతుందట. దసరా సీజన్లో మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుందని ఈ సీజన్ డిసెంబర్ వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. ఏదేమైనా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ ఒక్క‌సారి స్టార్ట్ అయితే సోష‌ల్ మీడియాలో హంగామా అయితే మామూలుగా ఉండ‌దు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news