Moviesబాల‌య్యా ఆ రాంగ్ స్టెప్ వ‌ద్దు… ఫ్యాన్స్ ద‌య‌చేసి వేడుకుంటున్నారుగా..?

బాల‌య్యా ఆ రాంగ్ స్టెప్ వ‌ద్దు… ఫ్యాన్స్ ద‌య‌చేసి వేడుకుంటున్నారుగా..?

టాలీవుడ్ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మూడు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన బాల‌య్య ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో 109వ సినిమాలో న‌టి్తున్నాడు. ఇదిలా ఉంటే గ‌త రెండు రోజులుగా బాల‌య్య‌పై ఓ గాసిప్ చ‌క్కెర్లు కొడుతోంది. అది కూడా ఓ రీమేక్ సినిమాలో బాల‌య్య న‌టిస్తున్నాడ‌న్న‌ది ఆ సినిమా సారాంశం. మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ఆవేశం సినిమాను బాల‌య్య రీమేక్ చేయ‌బోతున్నార‌న్న‌దే ఆ గాసిప్ సారాంశం.

టాలీవుడ్‌లోని ఓ బ‌డా నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకుంద‌ని.. ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య కాంబినేష‌న్ సెట‌ట్ చేసి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నార‌న్న వార్త‌లు చ‌క్కెర్లు కొట్టాయి. ఆవేశం మంచి సినిమానే.. మ‌ళ‌యాళంలో ఈ సినిమా బాగా ఆడింది.. అయితే ఆ క‌థ బాల‌య్య‌కు ఎంత మాత్రం సూట్ కాదు… మ‌ళ‌యాళంలో ఫ‌హాద్ ఫాజ‌ల్ చేసిన పాత్ర అది.

బాల‌య్య ఇమేజ్ వేరు.. ఫాహాద్ ఇమేజ్ వేరు.. ఇద్ద‌రికి ఎంత మాత్రం మ్యాచ్ అయ్యే ప్ర‌శ‌క్తే లేదు. అలాంట‌ప్పుడు ఈ రీమేక్ ఎలా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని బాల‌య్య అనుకుంటున్నారో తెలియ‌డం లేదు. బాల‌య్య ఫ్యాన్స్ కూడా బాల‌య్య ఆవేశం రీమేక్ చేస్తార‌న్న గాసిప్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సోషల్ మీడియాలో బాల‌య్యా ఈ ఆవేశం మ‌న‌కు వ‌ద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎందుకంటే బాల‌య్య ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆయ‌న‌కు రీమేక్‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎంద‌రో ద‌ర్శ‌కులు బాల‌య్య‌తో సినిమా చేసేందుకు క్యూలో ఉన్నారు. ఇలాంటి టైంలో బాల‌య్య ఈ రీమేకుల‌తో రిస్కులు చేయ‌డం అవ‌స‌ర‌మా ? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news