నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన కెరీర్ లో 21వ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. అలాగే తన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర సినిమాను నిర్మిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ 21వ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా… ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాను కూడా ఓకే చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో కుమారి 21ఎఫ్ – 18 పేజెస్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ కళ్యాణ్ రామ్‌కు కథ చెప్పి లాక్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథ నచ్చిన తర్వాత సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. సుకుమార్ శిష్యుడైన సూర్య ప్రతాప్ తెరకెక్కించే ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.