Moviesఆ హీరోయిన్ మీద మనసు పడ్డ అల్లు అర్జున్.. అందుకే ఆ...

ఆ హీరోయిన్ మీద మనసు పడ్డ అల్లు అర్జున్.. అందుకే ఆ పని చేశారా..?

అల్లు అర్జున్.. ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలు, అభిమానులు అందరూ ఈ హీరో మీదే భారీ హోప్స్ పెట్టుకున్నారు.దానికి ప్రధాన కారణం పుష్ప-2.. ఈ సినిమా ఆగస్టులో విడుదలవుతుందని ఎన్నో హోప్స్ క్రియేట్ చేసి మళ్లీ వాయిదా పడిందని బ్యాడ్ న్యూస్ చెప్పారు.కానీ డిసెంబర్లో విడుదలవుతుంది అని మరో గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ అభిమానుల్లో మాత్రం కాస్త నిరాశ పడుతున్నారు. అయితే ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టే అన్ని సన్నివేశాలు ఉండాలి అని డైరెక్టర్ సుకుమార్ ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరికెక్కిస్తున్నారట.

అందుకే సినిమా షూటింగ్ చాలా లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ మీద ఇప్పటికే చాలాసార్లు హీరోయిన్ల తో డేటింగ్ వార్తలు వినిపించాయి. అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్,పూజ హెగ్డే వంటి కొంతమంది హీరోయిన్లతో అల్లు అర్జున్ కి డేటింగ్ వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కానీ రకుల్ ప్రీత్ సింగ్ కారణంగా బన్నీకి స్నేహ రెడ్డి వార్నింగ్ ఇచ్చిందనే టాక్ మాత్రం టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో గట్టిగా వినిపించింది.

ఈ విషయం పక్కన పెడితే అప్పట్లో అల్లు అర్జున్ ఓ హీరోయిన్ మీద మనసు పడ్డారని, అందుకే ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలు సినిమాల్లో ఇచ్చారనే టాక్ మీడియాలో వినిపించింది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు కేథరిన్ తెరిస్సా.. మలయాళ సినిమాల ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ తెలుగులోకి వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో మూవీ తో ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ సినిమాతో గుర్తింపు రాలేదు. ఇక ఎప్పుడైతే అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో మూవీలో సెకండ్ హీరోయిన్ గా కేథరిన్ నటించిందో అప్పటినుండి కేథరిన్ కి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.

అలా తెలుగులో ఈమె పైసా, నేనే రాజు నేనే మంత్రి,గౌతమ్ నంద, సరైనోడు, వదలడు, వరల్డ్ ఫేమస్ లవర్,బింబిసారా వంటి మూవీస్ లో నటించింది.కానీ ఈమె ఎక్కువ శాతం సెకండ్ హీరోయిన్ గానే చేసింది. అయితే ఇద్దరమ్మాయిలతో సినిమా చేసే సమయంలో అల్లు అర్జున్ కి కేథరిన్ కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడడంతో ఆయన తన సరైనోడు మూవీ లో కూడా కేథరిన్ కి సెకండ్ హీరోయిన్ అవకాశం ఇచ్చారనే టాక్ వినిపించింది.

అంతే కాకుండా రుద్రమదేవి సినిమాలో కూడా అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర చేస్తే అన్నాంబిక పాత్రలో అల్లు అర్జున్ కి జోడిగా కేథరిన్ నటించింది. అలా అల్లు అర్జున్ తన మూడు సినిమాల్లో కేథరిన్ ని తీసుకునేసరికి టాలీవుడ్ మీడియాలో కేథరిన్ పై మనసు పడ్డ అల్లు అర్జున్ అంటూ న్యూస్ వైరల్ చేశారు.ఇక ఎప్పుడైతే ఈ రూమర్ వినిపించిందో అప్పటినుండి అల్లు అర్జున్ తన సినిమాలో ఈ హీరోయిన్ ని తీసుకోవడం మానేశారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news