మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమా రి రిలీజ్ అయింది. మెగా అభిమానులు మెగాస్టార్ పుట్టినరోజు అని ఈ సినిమా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఇంద్ర సినిమా రిలీజ్ వేళ.. మెగా ఫ్యామిలీకి చెందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను మెగా అభిమానులు విలన్‌ను చేశారు. అదేంటి ఈ సినిమా రిలీజ్‌కు అల్లు అర్జున్‌కు సంబంధం ఏంటని ? అనుకుంటున్నారా … శివాజీ ఇంద్ర సినిమాలో కీలకపాత్ర పోషించారు. శివాజీ సినిమాలో చిరంజీవి మేనకోడలు అయిన మాధురిని ప్రేమించి పెళ్లి పీటల మీదకు వచ్చేసరికి చిరంజీవికి యాంటీగా మారతాడు శివాజీ. ఒక రకంగా చెప్పాలి అంటే చిరంజీవి దయతో ఎదిగి చిరంజీవిని వెన్నుపోటు పొడిచే పాత్ర అది.
అయితే ఇప్పుడు సినిమాలో ఈ సీన్ వస్తుంటే మెగా అభిమానులు అల్లు అర్జున్ ను ఈ పాత్రతో పోలుస్తున్నారు. సినిమాలో సన్నివేశం వచ్చినప్పుడు అల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఒకటే అరిచి గోల చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికే మెగా ఫ్యామిలీకి బన్నీకి ఉన్న పాత గొడవలు.. కాస్త తాజాగా బన్నీ చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరాయి. ఓ ఫంక్షన్ లో పాల్గొన్న బన్నీ రెండు కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ఇష్టమైతేనే వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా.. అన్నారు. ఇవన్నీ పరోక్షంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి చేశారన్న కామెంట్లు వినపడుతున్నాయి.
ఇక ఈ హీరోని చూసి చాలా మంది అభిమానులు అవుతారని… కానీ తాను మాత్రం అభిమానులను చూసి హీరో అంటూ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశారు. దీంతో బన్నీ మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఈ కామెంట్లు చేశారన్న చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు మెగా అభిమానులు ఇంద్ర సినిమాలో శివాజీ పాత్రను అల్లు అర్జున్ తో పోలుస్తూ విమర్శిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కూడా రంగంలో దిగి కౌంటర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌కి మధ్య మరింత గ్యాప్ పెరిగేలా కనిపిస్తోంది.