Moviesచిరు మూవీలో ఛాన్స్‌.. నిర్మొహ‌మాటంగా నో చెప్పిన శ్రీ‌లీల‌..!

చిరు మూవీలో ఛాన్స్‌.. నిర్మొహ‌మాటంగా నో చెప్పిన శ్రీ‌లీల‌..!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల టాలీవుడ్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌ మునుప‌టంత జోరు చూపించ‌లేక‌పోతోంది. స‌క్సెస్ రేట్ త‌క్కువ‌గా ఉండ‌టంతో.. శ్రీ‌లీల‌కు ఛాన్సులు కూడా తగ్గుతూ వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి పిలుపొస్తే.. శ్రీ‌లీల నిర్మొహ‌మాటంగా నో చెప్పింద‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ల‌కు దారి తీసింది.

మల్లిడి వసిష్ఠ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి విశ్వంభ‌ర అనే సోసియో-ఫాంటసీ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు విక్రమ్ రెడ్డి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న విశ్వంభ‌ర 2025 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతోంది.

అయితే ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంటుంద‌ట‌. ఆ సాంగ్ కోసం ఇటీవల చిత్ర‌బృందం శ్రీ‌లీలను సంప్ర‌దించింద‌ట‌. శ్రీ‌లీల డాన్స్ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప‌క్క‌ర్లేదు. ఒక‌ర‌కంగా డాన్సుల వ‌ల్లే ఆమె ఎక్కువ పాపుల‌రిటీని సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే విశ్వంభ‌ర టీమ్ ఆమెతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా.. శ్రీ‌లీల మాత్రం వారి ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేసింద‌ట‌. ఇప్ప‌ట్లో ఐటెమ్ సాంగులు చేసే ఉద్దేశం త‌న‌కు లేద‌ని చిరు మూవీలో ఛాన్స్ ను చేతులారా వ‌దులుకుంద‌ట‌. అలాగే మ‌రికొన్ని చిత్రాల్లో కూడా ప్రత్యేక గీత‌లు చేసే ఆఫ‌ర్లు రాగా.. వాటికి సైతం శ్రీ‌లీల నో అనేస్తుంద‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news