టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున అందరూ ప్రభాస్ పేరు చెబుతారు. కానీ ప్రభాస్ కంటే సీనియర్ మరొకరు ఉన్నారు. అతనే పెన్మెత్స సుబ్బరాజు. భీమవరం కు చెందిన సుబ్బరాజు.. హైదరాబాద్‌లోని డెల్ కంప్యూటర్స్ లో ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్ ను బాగు చేయడానికి ఇంటికి వెళ్ళగా.. ఆయన సుబ్బరాజు పర్సనాలిటీ చూసి ఖడ్గం మూవీలో యాక్ట్ చేసే అవకాశం ఇచ్చారు.
అలా ఖడ్గం సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయిన సుబ్బరాజు.. హీరోలకు ఏమాత్రం తీసిపోని కటౌట్ మరియు టాలెంట్ ఉన్నప్పటికీ విలన్ గా, సహాయక నటుడిగానే ఇండస్ట్రీలో ఎదిగారు. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రంలో కుమార వర్మ గా నటించి ప్రేక్షకులకు గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
అయితే కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన సుబ్బరాజు.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వెనుకపడ్డారు. ఈయన ఏజ్ 47.. కానీ ఇంకా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. గతంలో పలుమార్లు వివాహం పై సుబ్బరాజుకు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ఆయన సమాధానాలు వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓ ఇంటర్వ్యూలో సుబ్బరాజు వివాహం గురించి మాట్లాడుతూ..
పెళ్లి ఎప్పుడూ కావాలని, ఎవరో అంటున్నారని, ఏజ్ దాటిపోతుందని చేసుకోకూడదు, ఆ అవసరం వచ్చినపుడు చేసుకోవాలి. ఇప్పటివరకు పెళ్లితో నాకు అవసరం రాలేదు. కానీ అది వచ్చినప్పుడు.. నా జీవిత భాగస్వామికి నేను బెస్ట్ ఇవ్వగలను, ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలనని నాకు అనిపించినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను
అని చెప్పుకొచ్చారు. మొత్తానికి పెళ్లి విషయంలో ఈయన పిచ్చ క్లారిటీతో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం సుబ్బరాజు త్వరగా ఓ ఇంటివాడైతే చూడాలని ఆశపడుతున్నారు. మరి వారి ఆశ నెరవేరుతుందా..? లేక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాదిరి లైఫ్ లాంగ్ సుబ్బరాజు కూడా సింగిల్‌గానే ఉండిపోతారా..? అన్నది చూడాలి.