టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దివంగత దర్శకుడు టి. కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. గోపీచంద్ మాత్రం తన స్వయం కృషితోనే హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్టార్ హోదాను అందుకున్నాడు.
అలాగే రీల్ లైఫ్ మరియు రియల్ లైఫ్ లో గోపీచంద్ కు క్లీన్ ఇమేజ్ ఉంది. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు గోపీచంద్ ఎప్పుడు దూరమే. షూటింగ్స్, ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ ఇవే ఆయన ప్రపంచాలు. నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మను గోపీచంద్ వివాహం చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాగా.. గోపీచంద్, రేష్మ దంపతులకు విరాట్ కృష్ణ, వియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇకపోతే పెళ్లికి ముందు గోపీచంద్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ ను ప్రేమించాడని గతంలో ప్రచారంలో జరిగింది. సదరు హీరోయిన్ తో ఏడడుగులు వేయాలని కూడా గోపీచంద్ అనుకున్నాడట. కానీ అలా జరగలేదు. ఇంతకీ గోపీచంద్ ప్రేమించిన హీరోయిన్ మరెవరో కాదు స్నేహ. గోపీచంద్ డెబ్యూ మూవీ తొలి వలపులో స్నేహానే హీరోయిన్ గా నటించింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2001 లో విడుదలై పరాజయం పాలయింది.
అయితే తొలివలపు సినిమా షూటింగ్ సమయంలో స్నేహ వ్యక్తిత్వం నచ్చి గోపీచంద్ ఆమెతో ప్రేమలో పడిపోయాడట. స్నేహను పెళ్లి చేసుకోవాలని గోపీచంద్ భావించాడట. ఆమెకు ప్రపోజ్ కూడా చేయాలని అనుకున్నాడ.ట కానీ స్నేహ మాత్రం గోపీచంద్ ను ఒక బ్రదర్ లా భావించేదట. ఇదే విషయాన్ని సెట్స్ లో స్నేహ పలువురుతో చెప్పడం విన్న గోపీచంద్.. తన ప్రేమను ఆరంభంలోనే సమాధి చేశాడట. ఇక ఆ తర్వాత ప్రేమ జోలికి పోకుండా గోపీచంద్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.