నందమూరి నటసింహం బాలకృష్ణ మెంటాలిటీ వేరు. ఓ హీరోయిన్ తో ట్యూన్ అయ్యాడంటే చాలు బాలయ్య ఆమెతోనే ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. రాధికా ఆఫ్టేతో వరుసగా రెండు సినిమాలు.. సోనాల్ చౌహాన్‌తో మూడు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు అలాంటి లక్కీ ఛాన్స్ ప్రగ్యా జైశ్వాల్‌కు వచ్చేసింది. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ అఖండ 2 సినిమాలో ఆమె నటించింది. కలెక్టర్ పాత్రలో అదర గొట్టేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
అయితే ఇప్పుడు అఖండ సినిమాకు కంటిన్యూగా బోయపాటి అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోనూ ప్రగ్య క్యారెక్టర్ కంటిన్యూ కాబోతుందట. అఖండ 1లో కనిపించిన పాత్రలు అన్నీ అఖండ 2 సినిమాలోనూ కంటిన్యూ అవుతున్నాయి. బాలయ్య రెండు పాత్రలతో పాటు బాలయ్య తల్లి పాత్ర.. ఫ్యామిలీ.. పాప అందరూ అఖండ సీక్వెల్లోనూ కనిపించనున్నారు.
ఈ క్రమంలోనే ప్రగ్య పాత్ర కూడా అఖండ 2లో ఉండబోతోంది. వాస్తవానికి మరో హీరోయిన్ తీసుకుందామని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఆలోచన చేసిందట కూడా.. అయితే బాలయ్య పట్టుబట్టి బోయపాటికి చెప్పి ప్రగ్యానే సీక్వెల్లోనూ తీసుకోవాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య – బాబి కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశీ రౌతాలా హీరోయిన్.
ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్రకు ప్రగ్యాను తీసుకున్నారు. అలా ప్రగ్య వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ కొట్టింది. ఛాన్సులు రాని టైంలో ఆమె బాలయ్య పక్కన వరుసగా మూడు సినిమాల్లో ఛాన్స్ అంటే మామూలు లక్ కాదు.