దివంగత సీనియర్ నటి విజయనిర్మల ఎంతో గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు – తమిళ – కన్నడ – మలయాళ భాషలలో 151 పైగా సినిమాలలో నటించిన విజయనిర్మల 50 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు. ఈ రికార్డును ఇప్పటి వరకు ప్రపంచ సినీ చరిత్రలో ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. విజయనిర్మల ఇండస్ట్రీలోకి వచ్చే టైంకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లయింది.. మొదటి భర్తతో సీనియర్ హీరో నరేష్ కూడా ఆమెకు జన్మించారు.
ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో ఏర్పడిన అనుబంధంతో ఆమె సూపర్ స్టార్ కృష్ణ జీవితంలోకి రెండో భార్య గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయనిర్మల గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణతో తన పెళ్లికి సంబంధించిన అనుబంధాన్ని పంచుకున్నారు. తిరుపతిలో అమ్మ కోసం షూటింగ్ జరుగుతున్న టైంలో తమ ఇద్దరికీ వివాహం జరిగిందని చెప్పారు. అయితే రమాప్రభ తనకు దగ్గర బంధువు అని.. అలాంటి కొందరి ఆత్మీయులకు తప్ప కృష్ణ గారితో నా వివాహం గురించి ఎవరికీ తెలియదు అని విజయనిర్మల తెలిపారు. అయితే కృష్ణ గారితో నా పెళ్లిని మా నాన్నగారు ఒప్పుకోలేదన్నారు.
ఆ తర్వాత కృష్ణ గారు నాపై చూపించిన అభిమానం చూసిన మా నాన్న ఇద్దరిని ఆశీర్వదించినట్టు విజయనిర్మల తెలిపారు. ఇక తనకు నటన కన్నా దర్శకత్వమే బాగా సంతృప్తి ఇచ్చిందని.. 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించాను అని… అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా నా పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని విజయనిర్మల తెలిపారు. ఇక జయసుధ – విజయశాంతి లాంటి హీరోయిన్లను తానే తెలుగు తెరకు పరిచయం చేశానని.. వాళ్ళు తర్వాత ఎంత స్టార్ హీరోయిన్లుగా రాణించారో తెలిసిందే అని విజయనిర్మల తెలిపారు.