సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటీమణుల్లో ప్రియమణి ఒకరు. కేరళకు చెందిన ప్రియమణి.. 2003లో ఎవరే అతగాడు మూవీతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. పెళ్ళైన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి తనదైన ప్రతిభతో స్టార్ హోదాను అందుకుంది.
2007లో పరుత్తివీరన్ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. 2015 వరకు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఆ తర్వాత కుర్ర హీరోయిన్ల హవా ఎక్కువగా ఉండటం, ప్రియమణికి వివాహం కావడంతో స్టార్ హీరోలు ఆమెను పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు. దాంతో ప్రియమణి రూటు మార్చి బలమైన సహాయక పాత్రలు, విలనీ పాత్రలు ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్‌గా కెరీర్ ను సాగిస్తోంది. అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అలరిస్తోంది.
ఇకపోతే గతంలో ప్రియమణికి సంబంధించి ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అయింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో ప్రియమణికి హైదరాబాద్ లో ఫ్లాట్ కొనిచ్చాడన్నదే ఆ వార్త సారాంశం. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా సత్తా చాటిన జగపతిబాబు ప్రస్తుతం ప్రియమణి మాదిరిగానే విలన్ గా, సహాయక నటుడిగా కొనసాగుతున్నాడు.
అయితే జగపతిబాబు, ప్రియమణి జంటగా పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం వంటి చిత్రాలు చేశారు. వీటితో పెళ్ళైన కొత్తలో చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ సమయంలోనే జగపతిబాబు, ప్రియమణి మధ్య రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిందని.. ఇద్దరూ కొన్నాళ్లు సీక్రెట్ ఎఫైర్ నడిపించారనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టాయి. అంతేకాదు, ఈ జర్నీలో ప్రియమణిపై ఉన్న ప్రేమతో జగపతి బాబు హైదరాబాద్ లో ఆమెకు ఒక ఫ్లాట్ కూడా కొనిచ్చాడని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారంపై అటు జగపతిబాబు, ఇటు ప్రియమణి ఇద్దరూ స్పందించలేదు. అలా అని ఖండించనూ లేదు. అందువల్ల అది ఎంత వరకు నిజమన్నది వాళ్లకే తెలియాలి.