అలనాటి అందాల తార శ్రీదేవి 50 ఏళ్లు వచ్చినా కూడా చెక్కుచెదరని అందంతో అందరినీ ఎంతో అలరించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో కొంతమంది హీరోలు వెనకడుగు వేస్తే ఇంకెంతో మంది హీరోలు ఆమెను పెళ్లాడాలని చూసారు. అందులో రజినీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు బోనీకపూర్ తనకి పెళ్లి అయినా కూడా శ్రీదేవి మీద ఉన్న పిచ్చి ప్రేమతో మొదటి భార్యను వదిలేసి శ్రీదేవిని తన భార్యగా చేసుకున్నారు. అయితే అలాంటి శ్రీదేవితో ఒక్కరోజు గడపడం కోసం ఒక వ్యక్తి చేసిన పని తెలిస్తే మీరంతా షాక్ అవ్వాల్సిందే.మరి ఇంతకీ ఆయన ఎవరు..ఏం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం..
శ్రీదేవి అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే అలాంటి శ్రీదేవి దగ్గర పని చేసినా సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె గురించి తెలియని విషయాలు బయట పెట్టారు.అయితే అప్పట్లో శ్రీదేవి దగ్గర ఈమంది రామారావు పని చేసిన సమయంలో ఆయనకు 650 రూపాయల జీతం ఇచ్చేదట. అలా శ్రీదేవి జీవితాన్ని రామారావు దగ్గరుండి చూశారు. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. అప్పట్లో శ్రీదేవి పై ఎంతో మంది హీరోలు ప్రేమ పెంచుకున్నారు.
ఒక అరబ్ షేక్ అయితే శ్రీదేవిని తనకి ఒక్కరోజు కలిసే అవకాశం ఇవ్వమని నాకు వెయ్యి రూపాయలు చెక్ రాసి పంపించారు.అంతేకాదు ఎన్నో ఉత్తరాలు కూడా పంపారు.అయితే ఈ విషయాన్ని నేను ఓ రోజు శ్రీదేవికి చెప్పగా తన తల్లికి ఈ మ్యాటర్ చెప్పింది. అయితే శ్రీదేవి తన తల్లికి తెలియకుండా ఏ పని చేసేది కాదు. ఇక ఈ విషయం మొత్తం విన్న శ్రీదేవి తల్లి ఆ అరబ్ షేక్ ని ఇంటికి పిలిపించి నువ్వు నా కూతురితో ఒక్కరోజు మాట్లాడి,భోజనం చేయాలంటే నీకు ఒక కండిషన్ టీ నగర్ లోని సరస్వతి మహల్ లో 4000 గజాలలో ఓ ఇల్లు ఉంది. దాన్ని కొని శ్రీదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడికి వస్తే అప్పుడు శ్రీదేవి నీతో మాట్లాడుతుంది అని శ్రీదేవి తల్లి అరబ్ షేక్ తో చెప్పింది.
దాంతో శ్రీదేవితో ఎలా అయినా మాట్లాడాలి అనుకున్న అరబ్ షేక్ వెంటనే వెళ్లి 4,000 గజాల ఇల్లును కొనేసి రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకువచ్చి శ్రీదేవి తల్లికి చూపించగా వెంటనే శ్రీదేవితో మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చింది. అలా అప్పట్లో శ్రీదేవి అంటే ఎంతోమంది పడి చచ్చిపోయేవారు అంటూ ఈమంది రామారావు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు.