టాలీవుడ్ లో నెం.1 దర్శకుడు ఎవరు అంటే ప్రతి ఒక్కరూ చెప్పే పేరు రాజమౌళి. గత కొన్నేళ్ల నుంచి ఆయన స్థానాన్ని మరే దర్శకుడు భర్తీ చేయలేకపోయాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో రాజమౌళి నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు. తన మేకింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ డైరెక్టర్స్ ను ఆశ్చర్యపరిచారు. కెరీర్ ఆరంభం నుంచి అపజయం ఎరుగని దర్శకుడిగా సత్తా చాటుతున్న రాజమౌళికి ఓ టాలీవుడ్ డైరెక్టర్ తన పనితనంతో అసూయ పుట్టించారు అంటే నమ్మగలరా? కానీ అది నిజం.
స్వయంగా రాజమౌళిని ఈ విషయాన్ని ఒప్పుకోవడం మరొక విశేషం. ఇంతకీ టాలీవుడ్ లో రాజమౌళికే అసూయ పుట్టించిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్. కాకినాడలో ఒక పెద్ద కాలేజీలో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుకుమార్.. ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగారు. తక్కువ సమయంలోనే భారీ స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.
సుకుమార్ సినిమాలను ప్రేక్షకులే కాదు ఆయన తోటి దర్శకులు కూడా ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో రాజమౌళి కూడా ఒకరు. టాలీవుడ్ లో మీ మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అని ప్రశ్నిస్తే.. రాజమౌళి మరో ఆలోచన లేకుండా సుకుమార్ పేరే చెబుతారు. అంతలా ఆయన్ను అభిమానిస్తారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్య చూడగానే వీడెవడో(సుకుమార్) నాకు పెద్ద పోటీగా ఉన్నాడనిపించింది. ఆ క్షణం నా ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే కనిపించాయి.
ఒకటి సుకుమార్ ను ద్వేషించడం.. రెండు ప్రేమించడం. ఒకరిని ద్వేషిస్తూ పనిచేయడం కన్నా.. స్నేహం చేయడమే బెటర్. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే సుకుమార్ అంటే నాకెంతో ఇష్టం. ఇక సుకుమార్ సినిమాల్లో కొన్ని సీన్స్ చూస్తే నేను చాలా ఇబ్బంది పడిపోతాను. నాకెందుకు అలాంటి ఐడియాస్ రావని అసూయ కలుగుతుంది` అంటూ సుకుమార్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.