Moviesనితిన్ హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్ ఎవ‌రు.. పెళ్లి ఎందుకు క్యాన్సిల్...

నితిన్ హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్ ఎవ‌రు.. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది..?

టాలీవుడ్ లో యూత్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నితిన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జయం మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్.. ఆ తర్వాత జయపజయాలతో సంబంధం లేకుండా దాదాపు 30 చిత్రాల్లో నటించాడు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. 2020లో బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి శాలిని కందుకూరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ప్రస్తుతం నితిన్ అటు ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు ఇటు పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇకపోతే గతంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ నిత్య మీనన్ తో నితిన్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నితిన్, నిత్యా మీనన్ జంటగా ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి చిత్రాల్లో నటించారు.

వెంట వెంటనే విడుదలైన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేశాయి. నిత్యా మీనన్, నితిన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పైగా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇద్దరూ క్లోజ్ గా ఉండటంతో నిత్యామీనన్, నితిన్ లవ్ చేసుకుంటున్నార‌నే వార్తలు అప్ప‌ట్లో జోరుగా చక్కర్లు కొట్టాయి. అంతేకాదు నిత్య మీనన్ వ్యక్తిత్వం నచ్చడంతో గుండె జారి గల్లంతయ్యిందే సినిమా రిలీజ్ అనంత‌రం ఆమెకు నితిన్ త‌న ల‌వ్ ను ఎక్స్‌ప్రెస్‌ చేశాడ‌ట‌. పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టాడట.

అయితే నిత్యామీనన్ మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల.. ముఖ్యంగా హీరో నితిన్ తల్లిదండ్రుల‌కు ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్ల‌ పెళ్లి ప్రపోజ‌ల్ ను రిజెక్ట్ చేసింద‌ట‌. దాంతో నితిన్ హార్ట్ బ్రేక్ అయింద‌ట‌. ఒకరినొక‌రు ప్రేమించుకున్న‌ప్ప‌టికీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయ‌క‌పోవ‌డంతో నితిన్‌, నిత్యా మీన‌న్ పెళ్లి క్యాన్సిల్ అయింద‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. మ‌రి ఇది వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది వాళ్ల‌కే తెలియాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news