సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ సినిమాల్లో రకరకాల ఆకర్షణలు జోడించబడ్డాయి. ఆ విధమైన సినీ అద్భుతాల్లో ద్విపాత్రాభినయం ముఖ్యమైనది. సినిమాల్లో ద్విపాత్రాభినయం అనేది భారీ ప్రాచుర్యం పొందింది. హీరో తెరపై ఇద్దరుగా కనిపిస్తే ఒకప్పుడు ప్రేక్షకులకు కన్నుల పండగలా ఉండేది. కానీ మూస చిత్రాలు ఎక్కువ కావడంతో.. ద్విపాత్రాభినయాల మీద ప్రేక్షకులకి ముఖం మొత్తింది. 90వ దశకం నుంచి ద్విపాత్రాభినయ చిత్రాల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
అయితే తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరో ఎవరో తెలుసా..? ఆ రికార్డు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పేరట ఉంది. తన సుధీర్గ సినీ ప్రయాణంలో సీనియర్ ఎన్టీఆర్ గారు 35కుపైగా సినిమాల్లో డ్యూయల్ క్యారెక్టర్స్ ను ప్లే చేశారు. ఈ రికార్డును ఇప్పటివరకు మరే హీరో బీట్ చేయలేకపోయారు.
ఎన్టీఆర్ గారి తర్వాత తెలుగులో అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరోగా సూపర్ స్టార్ కృష్ణ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం 25 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. అలాగే నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ గారి తర్వాత ఎక్కువగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించిన హీరోగా బాలకృష్ణ రికార్డ్ నెలకొల్పారు.
అపూర్వ సహోదరులు బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం కాగా..ఆదిత్య 369, పెద్దన్నయ్య, రాము భీముడు, సింహా, లెజెండ్, అఖండ, వీర సింహారెడ్డితో సహా 18 చిత్రాల్లో బాలకృష్ణ ఇప్పటివరకు డబుల్ రోల్స్ చేశారు. వాటిలో మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘజ విజయం సాధించడం మరొక విశేషం.