దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ఇప్పటికీ మీడియాలో హాట్ టాపికే..అసలు ఆయన ఎందుకు మరణించారు.. మరణం వెనుక ఉన్న కారణం ఏంటి.. అనేది చాలా మందికి మిస్టరీగా మారిపోయింది. ఎంతోమంది ఆయన మరణ రహస్యాన్ని ఛేదించాలి అనుకున్నారు. ఇక కొంతమంది ఉదయ్ కిరణ్ అంటే పిచ్చి ప్రేమ ఉన్నవాళ్లయితే ఆయనకు సినిమా అవకాశాలు రాకుండా మెగా ఫ్యామిలీ చేసి,ఆయన చావుకు కారణమైంది అని అంటే మరి కొంతమందేమో ఆయన భార్య కారణమైంది అని అంటారు.
అలాగే ఆ మధ్యకాలంలో ఉదయ్ కిరణ్ రాసిన ఒక లెటర్ కూడా మీడియాలో వైరల్ అయింది.ఆ లెటర్లో తన భార్యకి సంబంధించి విషయం చెబుతూ ఎవరో ఓ వ్యక్తిని నమ్మకు అని తన భార్యకు చెప్పారు. ఇలా ఉదయ్ కిరణ్ మరణం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.అలాగే అసలు ఈయన ఎందుకు మరణించారు అనే విషయం గురించి ఆయనతో నటించిన ఎంతోమంది నటీనటులను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ నిర్వహించినప్పటికీ ఎవరి దగ్గర నుండి సరైన సమాధానం రాలేదు.
ఇక డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో నేను చనిపోయే వరకు అయినా సరే ఉదయ్ కిరణ్ మరణానికి కారణం ఎవరో బయట పెడతాను అంటూ చెప్పారు. ఇక ఇదంతా పక్కన పెడితే అప్పట్లో ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితని పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి స్వయంగా తన కూతుర్ని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు. అంతే కాదు వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాక ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. అయితే వీరి పెళ్లి ఆగిపోవడానికి కారణం ఓ లేడి జర్నలిస్ట్ అంటూ అప్పట్లో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఉదయ్ కిరణ్ అక్క తెలియజేసింది. ఎందుకంటే ఉదయ్ కిరణ్ సుస్మిత కంటే ముందే ఆ లేడీ జర్నలిస్టుతో ప్రేమలో పడ్డారట.కానీ ఆ జర్నలిస్టు మోసం చేసేసరికి ఆ డిప్రెషన్లో మునిగి పోయారట ఉదయ్. అయితే ఓ రోజు ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లో ఉండడం చూసి చిరంజీవి ఏమైంది అని అడగగా.. తన లవ్ మేటర్ మొత్తం చిరంజీవికి చెప్పారు.ఇక ఆ సమయంలో చిరంజీవి ఉదయ్ కిరణ్ కి ధైర్యం చెప్పి అమ్మాయి పోతే జీవితం పోయినట్టు కాదు. లైఫ్ మీద ఫోకస్ పెట్టు అని మంచి మాటలు కూడా చెప్పారంటూ ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ సోదరి చెప్పింది. ఆ లేడి జర్నలిస్టుతో బ్రేకప్ అయ్యాకే ఉదయ్ కిరణ్ సుస్మితల ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పింది.