పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ రీసెంట్ గా కల్కి 2898 ఏడీ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కిన ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న ప్రభాస్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం బాగా వెనకపడ్డాడు. ఆయన వయసు హీరోలంతా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఇప్పటినుంచి ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ తరుణం మాత్రం రావడం లేదు. ఇక పెళ్లి గురించి పక్కన పెడితే.. ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? హీరోయిన్లైతే కాదండోయ్.
ఓ సాధారణ అమ్మాయిని మన డార్లింగ్ ఇష్టపడ్డాడట. గతంలో ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇంటర్వ్యూలో మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని ప్రశ్నించగా.. మొదట ప్రభాస్ సమాధానం చెప్పేందుకు అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత యాంకర్ పట్టుబట్టడంతో ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ పేరు రివీల్ చేసేశాడు.
చిన్నప్పుడు స్కూల్ లో ఒకరిపై నాకు క్రష్ ఏర్పడింది. క్లాస్ మెట్ కాదు టీచర్‌యే నా ఫస్ట్ క్రష్.. నేను చదివింది చెన్నై డాన్ బాస్కో స్కూల్ లో.. అక్కడ యామవల్లి అనే టీచర్ చాలా బాగుండేది అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. గతంలో ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ వంటి ప్రాజెక్ట్ లతో ప్రభాస్ లిస్ట్ లో ఉన్నాయి. వీటిలో రాజా సాబ్ మూవీ మరికొన్ని నెలల్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.