Moviesవారెవ్వా.. ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న కాంబో.. బాలయ్య మైండ్...

వారెవ్వా.. ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న కాంబో.. బాలయ్య మైండ్ బ్లోయింగ్ డెసిషన్..!?

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఒక కాంబోను కోరుకుంటున్నారు. ఆ కాంబో సెట్ అయితే రచ్చ రంబోలా అంటూ చాలామంది నెటిజెన్లు కామెంట్స్ చేశారు . ఫైనల్లీ ఇన్నాళ్ళకి ఆ కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది . అది మరేదో కాదు బాలయ్య – నాగార్జున కాంబో. ప్రెసెంట్ నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు . ఇన్నాళ్లు రాజకీయాలలో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చాడు .

ప్రెసెంట్ ఈ సినిమా షూట్ లో బిజీబిజీగా ఉన్నాడు బాలయ్య . ఈ సినిమా అయిపోగానే బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా కూడా త్వరగానే సెట్స్ పైకి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు . కాగా రీసెంట్గా బాలయ్య కిసంబంధించిన ఒక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య నాగార్జున కాంబోలో ఒక సినిమా రావాలి అని ఎప్పటినుంచి అక్కినేని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఏఎన్ఆర్ – ఎన్టీఆర్ కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చాయో మనకు తెలిసిందే. అన్నీ సూపర్ డూపర్ హిటే.. వీళ్ళ కొడుకుల కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుంది అంటూ ఆశపడ్డారు ఫ్యాన్స్. ఫైనల్లి ఇన్నేళ్లకు ఆ కోరిక తీరబోతుంది . బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించబోయే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నాగార్జున సెలెక్ట్ అయ్యాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో నాగ్ పలు సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news