మెగా ఫ్యామిలీలో బావా, బామ్మర్దులు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య గత కొంతకాలంగా తెలియని గ్యాప్ అయితే కొనసాగుతోందన్న పుకార్లు ఉన్నాయి. ఇది వృత్తిపరమైన పోటీతో మొదలయ్యి.. చివరకు పర్సనల్‌గా వెళ్లే వరకు వచ్చిందని తెలుస్తోంది. ఎవరికి వారు కెరీర్ పరంగా తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటూ వెళుతున్నారు. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయితే.. బన్నీ పుష్ప సినిమాతో ఇండియా స్టార్ హీరో అయిపోయారు.
ఇప్పుడు వీరిద్దరి నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇక పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు.. రెండు వారాల తేడాతో థియేటర్లలోకి వస్తున్నాయి. అసలే బావా, బావమరుదుల మధ్య తెలియని వార్ అయితే కొనసాగుతోంది.
ఎవరికి వారు రికార్డుల కోసం పంతానికి పోతున్నారు. ఎంత లేదని చెప్పుకుంటున్న కెరీర్ విషయంలో ఆచితూచి ముందుకు వెళుతున్నారు. ఒకరిని మించిన ప్రెస్టేజియస్ ప్రాజెక్టులతో మరొకరు పై చేయి సాధిస్తున్నారు. అలాంటిది ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు.. రెండు వారాల తేడాలు రిలీజ్ అయితే.. ఎంత లేదన్నా బాక్సాఫీస్ దగ్గర పోలిక వస్తుంది. ఏ హీరో సినిమా సూపర్ హిట్ అవుతుంది..? ఏ హీరో సినిమా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కొడుతుంది..? ఎవరి సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి..? ఎవరి సినిమాకు తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి..? ఇలాంటి లెక్కల మధ్య పోలిక తప్పనిసరిగా ఉంటుంది. ఏది ఏమైనా రామ్ చరణ్, బన్నీ మధ్య వృత్తిపరంగా జరుగుతున్న ఈ కోల్డ్ వార్‌కు ఇప్పట్లో పులిస్టాప్ పడే ఛాన్సులు కనపడటం లేదు.