టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. గ్లామర్ పరంగా, నటన పరంగా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. నటుడిగా, నిర్మాతగా వ్యాపారవేత్తగా సత్తా చాటడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో సైతం ముందుంటూ మహేష్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్దాపురం అనే రెండు గ్రామాలను దత్తత తీసుకుని.. రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాలతో వాటిని స్మార్ట్ విలేజెస్‌గా తీర్చిదిద్దారు. ఆ గ్రామాల్లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మద్దతు ఇచ్చారు. మరోవైపు మహేష్ బాబు ఫండేషన్ ద్వారా ఎందరో చిన్నాలకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. పేద పిల్లలను చదివిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అభిమానుల కుటుంబాలకు ఆర్థికంగా అండంగా నిలుస్తున్నారు.
ఇక ప్రతి ఏడాది పేదల కోసం మహేష్ బాబు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలిస్తే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన ప్రిన్స్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేద వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఏడాదికి రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. తన వార్షిక ఆదాయంలో 30 శాతం స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేస్తున్నారట.
మహేష్ బాబు ఆస్తుల విషయానికి వస్తే.. 2024లో ఈయన నికర విలువ రూ. 300 కోట్లు. హైదరాబాద్ లో మహేష్ బాబుకి రూ.30 కోట్లు విలువైన బంగ్లా ఉంది. ఇటీవలే బెంగళూరులో ఒక ఇల్లు కొన్నారు. మహేష్ బాబుకు రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడితో సహా పలు లగర్జీ కార్లు మరియు రూ.7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉన్నాయి.