Moviesస‌మంత - చైతు విడాకుల‌కు ముర‌ళీమోహ‌న్ ఇంట్లో ప‌నిమ‌నికి లింక్ ఏంటి..?

స‌మంత – చైతు విడాకుల‌కు ముర‌ళీమోహ‌న్ ఇంట్లో ప‌నిమ‌నికి లింక్ ఏంటి..?

అక్కినేని ఫ్యామిలీ హీరో అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ప్రేమ, పెళ్లి, విడాకులు తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ ఒక సంచలనం. దాదాపు 7 – 8 సంవత్సరాల పాటు ఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట.. పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకు విడిపోయారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడలుగా వెళ్ళింది అంటే ఆమె చేసుకున్న అదృష్టం అని చాలామంది భావించారు. ఇక ఈ జంటకు సీనియర్ హీరోయిన్ మురళీమోహన్ ఇంట్లో పనిమనిషితో కొంత సాన్నిహిత్యం ఉండేదట.

మురళీమోహన్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న పెంట్ హౌస్‌లో ఓ డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నాగార్జున రికమండేషన్‌తో నాగచైతన్యకు అమ్మారట. నాగచైతన్య, సమంత ఇద్దరూ మూడేళ్ల పాటు అక్కడే కాపురం చేశారు. ఆ డ‌బుల్‌ బెడ్ రూమ్ గది పక్కనే మురళీమోహన్ కూడా ఉండేవారు. మురళీమోహన్ ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి వాకింగ్ చేయడంతో పాటు పూజలు చేసేవారట. అదే టైంలో చైతు, సమంత కూడా నిద్రలేచి మురళీమోహన్‌తో పాటు వాకింగ్ చేయడం.. ఆయనకు గుడ్ మార్నింగ్ చెప్పటం అలా ఎంతో అనుబంధం ఉండేదట. అయితే మురళీమోహన్ ఇంట్లో పనిమనిషితో కూడా చైతు, సమంతకు కాస్త పరిచయం ఉందట.

చైతు.. సమంత జంట ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకునే వార‌ని మురళీమోహన్ అనుకునేవారట. వారు ఎంతో ఇష్టంతో ఉండ‌డంతో పాటు ఉద‌యం లేచిన వెంట‌నే స‌మంత కూడా ముర‌ళీమోహ‌న్‌కు న‌మ‌స్కారం చేసేవార‌ట‌. అయితే వారి మధ్య మనస్పర్ధలు వచ్చి వారు విడాకులు తీసుకుంటున్నారు అన్న విషయం మురళీమోహన్‌కు వాళ్ళింట్లో పని అమ్మాయి చెప్పేంతవరకు తెలియదట. అయ్యగారు చైతు బాబు.. సమంత విడిపోతున్నారట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారట అని చెప్పేసరికి మురళీమోహన్‌కు షాక్ కొట్టినంత పని అయిందట. అయితే మురళీమోహన్ వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని అనుకున్నా అప్పటికే వారిద్దరూ విడిపోవాలని బలంగా నిర్ణయం తీసుకోవడంతో తాను ఏం చేయలేకపోయానని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news