Newsబాల‌య్య సినిమాను ప‌ట్టుకుని అనుష్క అంత మాట అనేసిందేంటి..?

బాల‌య్య సినిమాను ప‌ట్టుకుని అనుష్క అంత మాట అనేసిందేంటి..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క శెట్టి ఎంతోమంది స్టార్ హీరోల కు జోడిగా ఎన్నో చిత్రాలలో నటించింది. అనుష్క ఎలాంటి పాత్రలోనైనా సరే మరీ ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా సినిమాలు తగ్గించినా ఈ ముద్దుగుమ్మ బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది .. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా తర్వాత మళ్లీ తెలుగులో ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు.

ఇతర భాషలలో ఒక చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు మాత్రమే తెలుస్తోంది. అయితే అనుష్క కెరియర్ లో ఒక పరమ చెత్త సినిమా కూడా ఉన్నదట. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క యాంకర్ ప్రశ్నలు అడగగా అందుకు దీటుగానే సమాధానం చెప్పింది. యోగ తెలియకపోతే మీ కెరియర్ ఎలా ఉండేది అని యాంకర్ అడగగా.. తన కెరియర్లో యోగా లేనిది ఊహించుకోలేనని. అది ఒకవేళ లేకపోతే తన జీవితమే గందరగోళంగా ఉండేది అంటూ తెలిపింది.

అలాగే తనకు కంఫర్టబుల్గా ఏ హీరో ఉంటారని అడగగా.. మహేష్ బాబు, గోపీచంద్ , రవితేజ అంటూ తెలియజేసింది. మీకు బాగా నచ్చిన చిత్రాలు ఏంటి అని అడగగా.. మొదట వేదం ఆ తర్వాత అరుంధతి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.. మీ కెరియర్ లో చెత్త సినిమా ఏదైనా ఉందా అని అడగగా.. ఒక్క మగాడు సినిమా అంటూ తెలియజేసింది.

ఈ సినిమాలో ఎందుకు ? నటించాను అని ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది అనుష్క.. అలాగే చివరిగా ఒక ప్రశ్న అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలలో ఒకేసారి ఆఫర్ వస్తే ఏ హీరోకి ప్రాధాన్యత ఇస్తారు అని అడగగా.. అనుష్క వెంటనే ఎన్టీఆర్ అంటూ తెలియజేసింది. ప్రస్తుతం అనుష్క గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news