Moviesహైద‌రాబాద్‌లో వార్ 2 ఇంట‌ర్వెల్‌... ఏ రేంజ్‌లో అంటే..?

హైద‌రాబాద్‌లో వార్ 2 ఇంట‌ర్వెల్‌… ఏ రేంజ్‌లో అంటే..?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా త‌ర్వాత ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ దేవ‌ర‌తో పాటు వార్ 2 సినిమాలోనూ న‌టిస్తున్నాడు. బాలీవుడ్‌లో తెర‌కెక్కి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన వార్ సినిమా స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ వార్ 2 వ‌స్తోంది. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్ లో భాగంగా 2019లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది వార్ సినిమా.

ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌కుడు. ఇదే ద‌ర్శ‌కుడు బ్ర‌హ్మాస్త్ర సినిమాను తెర‌కెక్కించి బ్లాక్బ‌స్ట‌ర్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌గా వార్ 2 వ‌స్తోంది. హీరోలుగా బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్‌తో పాటు టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ న‌టిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇదే హైలెట్‌. అందులోనూ ఓ బాలీవుడ్ హీరోతో క‌లిసి ఎన్టీఆర్ విల‌న్‌గా స్క్రీన్ షేర్ చేసుకోబోతుండ‌డం.. ఎన్టీఆర్‌ది విల‌న్ పాత్ర కావ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు.

ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. దీనికోసం భారీ బ‌డ్జెట్‌తో ఓ సెట్ కూడా వేస్తున్నార‌ట‌. ఆగ‌స్టులో ప్రారంభ‌మ‌య్యే ఈ షెడ్యూల్‌లో హృతిక్‌, ఎన్టీఆర్ మ‌ధ్య ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ షూట్ చేస్తార‌ట‌. ఈ ఫైట్ సీక్వెన్స్ ఇంట‌ర్వెల్ లో రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే హైలైట్ గా ఉండ‌నుందని టాక్‌. ఇక వార్ 2 సినిమాను 2025 ఆగ‌స్టు 14న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news