చాలామంది హీరోయిన్లు హీరోలతో రొమాన్స్ చేసే విధంగానే దర్శకులు వారి పాత్రలను తెరకెక్కిస్తారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రమే లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా హీరోల కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో విజయశాంతి ఒకరు.. లేడీ అమితాబ్ గా దక్షిణాదిలో తన సినిమాలతో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ హీరోలతో రొమాన్స్ చేయడమే కాదు ఒసేయ్ రాములమ్మ, అడవి చుక్క, వైజయంతి వంటి ఎన్నో లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా ఈమె చేసిన ఒసేయ్ రాములమ్మ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
అయితే విజయశాంతి నటించిన కొన్ని సినిమాలు పెద్దపెద్ద హీరోల సినిమా లతో పోటీపడి మరీ విజయం సాధించాయి. అయితే అలాంటి విజయశాంతి నిజంగానే తన భర్తకి విడాకులు ఇచ్చి ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందన్న వార్త ఆమెపై ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో బాగా వైరల్ అయిన ఆ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. విజయశాంతి,నందమూరి బాలకృష్ణ బంధువు అయినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ ని పెళ్లాడిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి పెళ్లయ్యాక టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అవేంటంటే.. విజయశాంతి తన భర్తకు విడాకులు ఇచ్చేసి నందమూరి బాలకృష్ణని రెండో పెళ్లి చేసుకోబోతుందని.. !
అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఓ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు చెబుతూ.. విజయశాంతి,బాలకృష్ణల పెళ్లి వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన విషయం నిజమే. అయితే వీరి మధ్య ఆ వార్తలు వినిపించడానికి ప్రధాన కారణం వీరిద్దరు ఎక్కువ సినిమాల్లో కలిసి నటించడమే.. ఇక వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి కొంతమంది అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ విజయశాంతి తన భర్తకు విడాకులు ఇచ్చి బాలకృష్ణని పెళ్లి చేసుకునేంత ప్రేమ మాత్రం లేదు.కేవలం వీరిద్దరు సినిమాల మట్టుకు మాత్రమే సన్నిహితంగా ఉండేవారు.కానీ కొంతమంది వీరి గురించి కావాలనే చెడు వార్తలు రాశారు.ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక బాలకృష్ణ, విజయశాంతి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందుకే అప్పట్లో వీరి గురించి రూమర్స్ వినిపించాయట.