Moviesఆ హీరోల అందరి నోరు మూయించే పని చేసిన వెంకటేష్..దగ్గుబాటి వంశం...

ఆ హీరోల అందరి నోరు మూయించే పని చేసిన వెంకటేష్..దగ్గుబాటి వంశం అంటే ఇదే రా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. దగ్గుబాటి వారసుడు వెంకటేష్ కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హైలైట్ గా మారింది . మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో విక్టరీ వెంకటేష్ హిట్ కొట్టిన దాఖలాలే లేవు . ఆయన ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మటూ పోతున్నాయి . అయితే ఇలాంటి మూమెంట్లోనే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆయన పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయేలా చేయడమే కాకుండా ఫ్యాన్స్ కి ఆయన పై స్పెషల్ రెస్పెక్ట్ పెంచేలా చేసింది .

ప్రెసెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైలర్ గా తెరకెక్కపోతుంది . కామెడీ యాంగిల్ ని కూడా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు . ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపించాయి. కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా నిర్వహించారు అనిల్ రావిపూడి . ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

“ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది .. మంచి ఎంటర్ టైనిం గా ఉంటుంది. వెంకటేష్ కి భార్యగా ఐశ్వర్య రాజేష్ .. ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటించబోతున్నారు. జులై 3 నుంచి చిత్రీకరణ స్టార్ట్ చేయబోతున్నాము. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది అంటూ చెప్పుకొచ్చారు”. దీంతో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు విక్టరీ వెంకటేష్ పేరు మారు మ్రోగిపోతున్నాయి. ఇన్నాళ్లు అసలే తెలుగు హీరోలు ఆమెకు అవకాశం ఇచ్చిందే లేదు ..టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తాడు విక్టరీ వెంకటేష్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు . గతంలో తెలుగు అమ్మాయి అంజలికి సైతం ఆఫర్ ఇచ్చింది వెంకటేష్ నే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కి కూడా కొత్త లైఫ్ ఇవ్వబోతున్నారు . మిగతా హీరోలు చేయలేని పని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేశాడు.. అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news