కోట శ్రీనివాసరావు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా.. విలన్‌గా కమెడియన్‌గా కూడా అనే క విభిన్నమైన పాత్రలు పోషించారు. కొన్ని కొన్ని సినిమాల్లో ఊర మాస్ గా కూడా నటించి.. ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. అయితే.. తొలినాళ్లలో పెద్దగా కోట అంటే ఎవరో ఎవరికీ తెలిసేది కాదు. ఇలాంటి సమయంలో వచ్చిన సినిమా.. ప్రతిఘటన. దీనిలో కోట పాత్రకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధుల య్యారు.
ప్రతిఘటన సినిమాను ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై.. రామోజీరావు తీశారు. ఈ సినిమా కూడా.. కేరళలో జరిగిన యదార్థకాథకు ప్రతిరూపంగా నిలిచింది. ఒక నాయకుడి నిరంకుశత్వ ధోరణిని ఎదిరించిన.. మహిళ తర్వాత కాలంలో కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టి.. ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడం ఈ సినిమా పూర్తి కథ. ఈ క్రమంలో సదరు మహిళ ఎదుర్కొన్న కష్టాలు.. ఇబ్బందులు.. అవమానాలు.. వంటివాటిని సినిమాలో హైలెట్ చేశారు.
అయితే.. సినిమాను పూర్తిగా తీసినప్పటికీ.. అంటే.. సదరు మహిళ అసెంబ్లీలో అడుగు పెట్టడం వరకు.. ఈ సినిమాను షూటింగ్ చేశారు. అయితే.. నిడివి ఎక్కువగా ఉండడంతో చివరి పార్టును దాదాపు 20 నిమిషాల సినిమాను తొలగించారు. ఇక, ఈ సినిమాలో కోట.. విశ్వరూపం చూపించారు. వస్తాండా.. పోతాండా.. అంటూ. డా ప్రయోగంతో కోట చేసిన యాక్షన్ నభూతో అనిపించుకుంది. ఈ సినిమా వరకు .. పెద్దగా ఆఫర్లు లేని కోట.. ఈ సినిమా తర్వాత.. బిజీ అయిపోయారు.
ఆ తర్వాత కోట శ్రీనివాసరావు విలనిజం అంటే టాలీవుడ్‌లో ఓ పెద్ద సెన్షేషన్ అయిపోయేది. ఆ తర్వాత గణేష్ లాంటి సినిమాలో క్రూరమైన విలన్‌గా కనిపించి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా కోట అందుకున్నారు.