టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది రాజమౌళి . దర్శకధీరుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . శాంతినివాసం సీరియల్ ద్వారా ఆయన తనలోని టాలెంట్ ను బయటపెట్టాడు . ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఫస్ట్ డైరెక్టర్ గా ఒక సినిమాని తెరకెక్కించాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు ఆ తర్వాత తనదైన స్టైల్ లో వరుసగా సినిమాల చేస్తూ దూసుకుపోయాడు.
ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు అంటే కారణం ఆయన సిన్సియారిటీ.. డెడికేషన్ .. కష్టమనే చెప్పాలి . ప్రతి ఒక్క సీన్ ని ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓకే చేస్తాడు . రీసెంట్ గా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .
కాగా రాజమౌళి తన సినిమాల విషయంలో ప్రతీది చాలా కేర్ఫుల్ గా స్టెప్ తీసుకుంటారు . అయితే సినిమా షూట్ స్టార్ట్ చేసే ముందు రోజు నైట్ మాత్రం అసలు సినిమా గురించి ఆలోచించడు.. అలా ఆలోచిస్తే ఆయనకు సినిమా బాగా రాదు అని ఒక ఒపీనియన్ ఉంటుందట. ప్రశాంతంగా కూల్ గా పడుకొని మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తో పూజ చేసుకొని షూటింగ్ కి వెళ్లి క్లియర్ మైండ్ సెట్ తో వర్క్ స్టార్ట్ చేస్తేనే ఏ పనైనా కంప్లీట్ అవుతుంది ..అని టెన్షన్ టెన్షన్ గా రాత్రంతా నిద్రపోకుండా మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే అది అలాగే బ్లాస్ట్ అవుతుంది అని రాజమౌళి నమ్మకం అట. అందుకే తన సినిమాల విషయంలో ప్రతిసారి ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతాడట . అందుకే ఆయన తెరకె క్కించిన సినిమాలు అంత సూపర్ డూపర్ హిట్ అవుతాయి అంటున్నారు అభిమానులు..!!