Moviesవారెవ్వా: బాలయ్య నా మజాకా.. చెల్లెలి కోసం ఏం గిఫ్ట్ ఇచ్చారో...

వారెవ్వా: బాలయ్య నా మజాకా.. చెల్లెలి కోసం ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా వెరైటీ గానే ఉంటుంది. నందమూరి బ్లడ్ అంటేనే అంత .. ఏ పని చేసిన చాలా స్పెషాలిటీగా చేస్తూ ఉంటారు . తాజాగా నందమూరి బాలకృష్ణ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరయ్యారు. వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .

వీళ్ళ పెళ్లి చాలా సింపుల్గా జరిగినా రిసెప్షన్ మాత్రం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకున్నారు. వీళ్ళ రిసెప్షన్ కి సంబంధించిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ – బాలీవుడ్ – మాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు వీళ్ళ రిసెప్షన్ కి హాజరయ్యారు . బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించి మెప్పించింది . ఆయనకు సిస్టర్ రోల్ లో అదరగొట్టేసింది .

ఈ సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య ఎంత కారణమో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అంతే కారణం . ఈ క్రమంలోనే బాలయ్యని స్పెషల్ గా ఇన్వైట్ చేసింది . వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య కూడా వెడ్డింగ్ రిసెప్షన్ కి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బొకే ఇచ్చారు అంతేకాదు నికోలయ్ సచ్ దేవ్ అదేవిధంగా వరలక్ష్మీ శరత్ కుమార్ కు స్పెషల్ రింగ్స్ కూడా గిఫ్ట్ చేశారు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చెల్లి కోసం అద్దిరిపోయే రేంజ్ లో వి ఎన్ అనే లెటర్స్ ను ఫింగర్ రింగ్స్ గా గిఫ్ట్ చేశారట. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news