దివంగత స్టార్ దర్శకుడు ఈవివి సత్యనారాయణ అంటే తెలియని వారు ఉండరు.ఈయన దర్శకత్వంలో చాలా సినిమాలు వచ్చాయి. అలా అప్పట్లో స్టార్ దర్శకుడిగా వెలుగొందిన ఇవివి సత్యనారాయణ ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా తయారు చేశారు.అయితే అలాంటి ఈయన తన ఇద్దరు కొడుకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్, చిన్న కొడుకు అల్లరి నరేష్. అయితే ఆర్యన్ రాజేష్ కంటే అల్లరి నరేష్ కే ఇండస్ట్రీలో ఫేమ్ నేమ్ రెండు వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్ రాజేష్ సినిమాలకు దూరంగా బిజినెస్లు చూసుకుంటున్నారు.
ఇక అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ కి మొదటి సినిమా పేరే తన ఇంటిపేరుగా మారిపోయింది.అప్పటి నుండి అల్లరి నరేష్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇక కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమాల్లో నటించడమే తన హ్యబీ గా పెట్టుకున్న అల్లరినరేష్ ని టాలీవుడ్ లో జూనియర్ రాజేంద్ర ప్రసాద్ అంటారు. రాజేంద్రప్రసాద్ తర్వాత మళ్లీ అన్ని కామెడీ సినిమాల్లో నటించింది ఈయనే. అందుకే ఈయనకు అలాంటి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ రూట్ మార్చి కామెడీ కాకుండా వేరే జానర్స్ లో సినిమాలు తీస్తున్నారు.
అయితే అలాంటి అల్లరి నరేష్ నిజంగానే తన తండ్రికి ఇష్టం లేదని ఆ అమ్మాయిని వదులు కున్నారా..ఇంతకీ అల్లరి నరేష్ ప్రేమించిన అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లరి నరేష్ ఇండస్ట్రీలో ఉన్న ఆ హీరోయిన్ తో డేటింగ్ చేశారు అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది హీరోయిన్ ఫర్జానా మాత్రమే.. బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, సీమశాస్త్రి వంటి రెండు సినిమాల్లో అల్లరి నరేష్, ఫర్జానా కలిసి నటించారు. అలా ఆ సినిమా సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే ఈ ప్రేమ వార్తలు టాలీవుడ్ మీడియాలో వినిపించేసరికి ఈ విషయం తెలిసిన నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ నరేష్ ని పిలిచి ఆ అమ్మాయి తో తిరగడం మానేయకపోతే నీకు నాకు సంబంధం లేదు. ఇప్పటి నుండి నువ్వెవరో నేనెవరో అని వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. ఇక అప్పటినుండి నరేష్ ఫర్జానాని తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోలేదని,అలాగే ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగినట్టు టాక్ వినిపించింది.అయితే ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ని ఫర్జానా గురించి అడిగితే..మా ఇద్దరి మధ్య అలాంటి బంధం ఏమీ లేదు.మీడియానే తప్పు వార్తలు రాసింది. ప్రస్తుతం ఆమెకు పెళ్ళై భర్తతో హ్యాపీగా ఉంది. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ క్లారిటీ ఇచ్చారు.