హీరో రాజ్ తరుణకు గత కొంతకాలంగా సరైన హిట్లు లేవు.. పైగా ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది.. అటు కెరీర్ పరంగా సరైన హిట్టు లేదు. ఇటు వ్యక్తిగత జీవితంలోను వివాదాలు తన ఇమేజ్ను దెబ్బతిస్తున్నాయి. ఇలాంటి టైంలో వచ్చిన సినిమా పురుషోత్తముడు. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ కు మంచి విజయం ఇచ్చిందా లేదా చూద్దాం.
కథ :
రచిత్ రామ్ ( రాజ్ తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రామ్ ( మురళీశర్మ) తనయుడు. లండన్ లో చదువుకుని ఇండియాకు వచ్చి కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టాలనుకుంటాడు. అందుకు రచిత పెద్దమ్మ వసుంధర ( రమ్యకృష్ణ ) అడ్డు చెబుతుంది. కంపెనీ నిబంధనలు ప్రకారం సీఈఓగా పనిచేసే వ్యక్తి వంద రోజులు సామాన్యుడిలా జీవితం గడపాలని పట్టుబడుతుంది. ఈ క్రమంలోనే రచిత్ ఆంధ్రప్రదేశ్లోని కడియం దగ్గర్లో ఉన్న రాయిపులంక అనే పల్లెటూరుకు చేరుకుంటాడు. రైతు కూలీగా కొత్త జీవితం ప్రారంభించిన అతడు ఆ తర్వాత ఆ ఊరి పూల రైతులను కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు ? రచిత్ కు అమ్ము ( హాసిని సుధీర్ ) కు మధ్య చిగురించిన ప్రేమ ఎలా మలుపులు తిరిగింది …చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ :
కోటీశ్వరుడు అయిన ఒక కుర్రాడు అన్ని వదులుకుని సామాన్యుడిలా జీవించాల్సి రావటం చాలా సినిమాల్లో చూసాం.. అయితే దర్శకుడు రాసుకున్న కథలోను సినిమాను తెరమీద చూపించిన విధానంలోనూ ఏ మాత్రం కొత్తదనం ఉండదు. పైగా రాజ్ తరుణ్ ఇమేజ్ కు మించిన కథ.. ఎలివేషన్లు.. బిల్డప్పులు.. యాక్షన్ సీన్లు అతిగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ లో ఒక మోస్తరుగా నడిచిన కథనం… సెకండాఫ్‌లో పూర్తిగా ట్రాక్ తప్పేసింది. పైగా విలన్ పాత్ర చాలా వీక్ గా ఉంటుంది.. క్లైమాక్స్ రొటీన్ గా ఉంటుంది. క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. ఆయన చెప్పే డైలాగులు బాగుంటాయి. అయితే నటుడుగా రాజ్ తరుణ్ బాగా నటించినా ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు.. యాక్షన్ సీన్లు కాస్త ఓవర్గా అనిపిస్తాయి. అమ్ము పాత్రలో హీరోయిన్ హాసిని పల్లెటూరు అమ్మాయిగా అందంగా కనిపించింది. కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం సెకండాఫ్ ఇవన్నీ రాజ్ తరుణ్ ఖాతాలో మరో ప్లాప్ సినిమాగా పురుషోత్తముడుని మార్చేశాయి.
పురుషోత్తముడు రాజ్‌తరుణ్‌కు మరో ప్లాప్
పురుషోత్తముడు మూవీ రేటింగ్ : 1.75 / 5
- వడ్డె మారెన్న