నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో సినిమాలలో నటించారు. అలాగే బాలయ్య – విజయశాంతి కాంబినేషన్లో కూడా ఎన్నో సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలయ్య తన కెరీర్‌లో ఓ రేర్ రికార్డ్ సాధించారు. ఒకే టైటిల్‌తో బాలయ్య రెండు సినిమాల్లో నటించారు. అందులో ఒక సినిమాలో బాలయ్య లక్కీ హీరోయిన్ విజయశాంతి ఆయనకు జోడీగా నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత అదే టైటిల్‌తో కొన్నేళ్లకు బాలయ్య మళ్లీ సినిమా చేస్తే.. ఆ సినిమాకు మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా ఆశించినంతగా ఆడలేదు. మరో విచిత్రం ఏంటంటే ఇదే టైటిల్‌తో అంతకు ముందే బాలయ్య తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కూడా ఓ సినిమా చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్టే.
ఆ టైటిల్ ఏదో కాదు కథానాయకుడు. ఎన్టీఆర్ – జయలలిత జంటగా 1969 ఫిబ్రవరి 27న కథానాయకుడు రిలీజ్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత బాలయ్య – విజయశాంతి కథానాయకుడు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామానాయుడు నిర్మించిన 17వ సినిమా ఇది. కె మురళీ మోహన్‌రావు ఈ సినిమాకు దర్శకుడు. ఇది కూడా సూపర్ హిట్. అలా తండ్రి, తనయుడు ఇద్దరు ఒకే టైటిల్‌తో వచ్చిన సినిమాల్లో నటించి సూపర్ హిట్లు కొట్టారు.
కథానాయకుడు సినిమాలో నటించిన 35 సంవత్సరాల తర్వాత మరోసారి అదే టైటిల్‌తో బాలయ్య సినిమా చేశారు. 2019 సంక్రాంతి కానుకగా.. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో ఆయన నటించారు. తొలిభాగానికి కథానాయకుడు టైటిల్ పెట్టారు. ఈ సినిమా కథా పరంగా బాగున్నా.. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంచనాలు అందుకోలేకపోయింది. అలా తండ్రి, తనయుడు ఇద్దరూ ఒకే టైటిల్‌తో మూడు సినిమాలు చేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ రికార్డుగా నిలిచిపోయింది.