Movies"కల్కి2" లో ఆ ఇద్దరు స్టార్ హీరోస్.. గూస్ బంప్స్ అప్డేట్...

“కల్కి2” లో ఆ ఇద్దరు స్టార్ హీరోస్.. గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్.. ఇక ఈ ఫ్యాన్స్ ని ఆపలేం రా బాబోయ్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న నాగ్ అశ్వీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమానే ఈ కల్కి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా..దిశా పటాన్ని – దీపికా పదుకొనే కీలకపాత్రలో మెప్పించారు . అదేవిధంగా అమితాబచ్చన్ -కమల్ హాసన్ ఇంపార్టెంట్ పాత్రలో నటించి మెప్పించారు .

అంతేకాదు ఈ సినిమాలో పలువురు స్టార్స్ గెస్ట్ పాత్రలో కనిపించి అదరగొట్టేశారు. ఎవరికి వాళ్లే నటించలేదు ..జీవించేసారనే చెప్పాలి . రీసెంట్గా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడాడు నాగ్ అశ్వీన్. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు . ఇదే క్రమంలో “వైజయంతి బ్యానర్ లో నటించిన చాలామంది హీరోలు కల్కి సినిమాలో సందడి చేశారు కదా ..? అయితే నాని – నవీన్ కనిపించలేదు “..రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా..? అంటూ ప్రశ్నించారు .

దీనికి నాగ్ అశ్వీన్ సమాధానమిస్తూ..”ఏమీ లేదు నాని – నవీన్ ఈ పార్ట్ లో కుదరలేదు ..కానీ నెక్స్ట్ పార్ట్ లో కచ్చితంగా కనిపిస్తారు ..ఎక్కడైనా పెట్టేస్తాను “అంటూ సమాధానమిచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు నాని – నవీన్ కల్కి 2లో భాగమైతే వాళ్ల కెరియర్ లు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు మలుపు తిరుగుతాయి అంటూ కూడా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news