టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. కేవలం 18 ఏళ్లకే హీరోగా దేవదాసు మూవీతో సినీ గడప తొక్కిన రామ్.. తొలి ప్రయత్నం లోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అటు క్లాస్ ఇటు మాస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ ఇది. కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తే.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతుంది. డబుల్ ఇస్మార్ట్ గురించి కాసేపు పక్కన పెడితే.. హీరో రామ్ సినిమాల్లోకి రాకముందు ఒక షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశాడన్న సంగతి మీకు తెలుసా..? దాని పేరు అడయాళం.
ఇదొక తమిళ షార్ట్ ఫిల్మ్. ఇందులో 18 ఏళ్ల డ్రగ్ అడిక్ట్‌గా రామ్ నటించాడు. అప్పటికి అతని వయసు కేవలం 11 ఏళ్లు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ లో అడయాళం షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించగా.. రామ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను అందుకున్నాడు. బహుశా ఆయన అభిమానుల్లో కూడా చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. రామ్ యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ చూడకపోతే మాత్రం కింద లింక్ ఉంది మిస్ అవ్వకుండా చూసేయండి.