Moviesరాజ‌మౌళి - ర‌మా మ‌ధ్య ప్రేమ పుట్టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే...!

రాజ‌మౌళి – ర‌మా మ‌ధ్య ప్రేమ పుట్టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే…!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ప్రపంచమే మెచ్చే గొప్ప దర్శకధీరుడు అయిపోయాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమైన రాజమౌళి ప్రస్థానం త్రిబుల్ ఆర్‌ సినిమా వరకు ఓటమి అన్నది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతూ వెళుతుంది. రాజమౌళి అత్యధికంగా జూనియర్ ఎన్టీఆర్ తో నాలుగు సినిమాల వరకు చేశారు. తన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 – రెండో సినిమా సింహాద్రి ఆ తర్వాత యమదొంగ – త్రిబుల్ ఆర్ ఇలా ఎన్టీఆర్ తో ఏకంగా నాలుగు సినిమాలు చేసిన రికార్డు రాజమౌళికి ఉంది.

ఆ తర్వాత ప్రభాస్‌తో ఛ‌త్రపతి – బాహుబ‌లి 1 – బాహుబలి 2 సినిమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి వయసులో తనకన్నా పెద్దవారు అయిన రమను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో రమా ప్రేమలో పడటానికి ముందే మరో వ్యక్తితో పెళ్లి అయ్యి మనస్పర్ధల నేపథ్యంలో విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత తన సోదరి ( కీరవాణి భార్య శ్రీ వ‌ల్లి ) ఇంట్లో ఉన్న టైంలో రాజమౌళి రమ మధ్య చూపులు చిగురించాయి. రాజమౌళి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శాంతినివాసం సీరియల్ ను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈ పరిచయం ఏర్పడింది.

ఆ వెంటనే ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీస్తున్న టైంలో వీరి ప్రేమ పీక్ స్టేజ్లో ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నప్పుడు రమా రాజమౌళి ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక రాజమౌళి – రమా రాజమౌళి జంట ఇప్పుడు తెలుగు మీడియాకు… తెలుగు సోషల్ మీడియాలో ఎంత స్టార్ సెలబ్రిటీ లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి మ‌హేష్‌బాబు 29వ సినిమాను పాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news