మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి సినిమాలో కనిపిస్తే చాలు ఆ బొమ్మ బ్లాక్‌బస్టరే. అసలు 20 – 25 ఏళ్ల క్రితం చిరంజీవి సినిమాకు మామూలు క్రేజ్ ఉండేదే కాదు. చిరు తెరమీద కనిపిస్తే చాలు 100 రోజులు ఆడేయాల్సిందే. చిరు వరుస హిట్లతో ఉన్న టైంలో చేసిన ఒక ప్రయోగం బెడిసి కొట్టింది. చిరు ఉన్నా కూడా హీరోయిన్ వల్ల ఆ సినిమా ప్లాప్ అయ్యిందంటే ఎవరైనా నమ్ముతామా ? కాని నమ్మాల్సిందే. కేవలం హీరోయిన్ వల్ల ఓ సినిమా ప్లాప్ అయ్యింది. సంజయ్‌దత్ హిందీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. అలా ఆ సినిమా శంకర్ దాదా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ సాధించింది.
ఆ తర్వాత స్టాలిన్ వచ్చి డిజాస్టర్ అయింది. స్టాలిన్‌కు మురుగదాస్ దర్శకుడు.. త్రిష హీరోయిన్.. అయినా ఈ సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ శంకర్ దాదా జిందాబాద్ గా సీక్వెల్ సినిమా హిందీలో వచ్చి సక్సెస్ సాధించగా… ఆ సీక్వెల్ సినిమాను కూడా చిరంజీవి హీరోగా ఇక్కడ రీమేక్ చేశారు. ఫస్ట్ పార్ట్ శంకర్‌దాదా ఎంబీబీఎస్‌కు జయంత్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు చిరు అభినయంతో పాటు హీరోయిన్ సోనాలిబింద్రే కూడా ప్లస్ అయ్యారు. అయితే శంకర్‌దాదా జిందాబాద్ సినిమాకు ప్రభుదేవా డైరెక్టర్.
ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ పార్ట్‌కు పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్‌గా సోనాలి బింద్రే నిలిచింది.. కానీ, సీక్వెల్ లో మాత్రం కరిష్మా కొటక్ నటించింది. ఎంత చిరంజీవి ఏజ్‌కు తగ్గట్టు ఆమెను తీసుకున్నా.. ఆమె ఏజ్ బార్ అయిన ముదురు ఆంటీలా కనిపించింది. పోస్టర్స్ చూస్తేనే చిరు పక్కన ఆ ఆంటీ హీరోయిన్ ఏంట్రా బాబు అని అభిమానులే తలలు పట్టుకున్నారు. అసలు ఈ అమ్మాయిని ఎవరు ? హీరోయిన్‌గా సెలక్ట్ చేశార్రా అని బాధపడ్డారు.
తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అసలు హీరోయిన్నే జనాలకు ఎక్కలేదు. ఫలితం డిజాస్టర్. ప్రభుదేవా చెత్త డైరెక్షన్‌తో పాటు హీరోయిన్ కరిష్మా కొటక్ కూడా శంకర్‌దాదా సీక్వెల్ ఫ్లాప్ కి కారణం అన్న టాక్ అప్పట్లో వినిపించింది.